/rtv/media/media_files/2025/07/27/odisha-2025-07-27-12-29-06.jpg)
Odisha
Odisha : పిల్లలు అప్పుడప్పుడు సరదాగా చేసే పనులు వారి ప్రాణాల మీదకు తెస్తుంటాయి. తెలిసీతెలియక చేసే పనులతో ఇంటిళ్లిపాది ఇబ్బందులకు గురవుతారు. ఒడిశాలో అలాగే జరిగింది. మూడేళ్ల చిన్నారి తన తండ్రి తెచ్చిన కొత్త బిందెతో సరదాగా ఆడుకుంటుండగా ఆ చిన్నారి తల అందులో ఇరుక్కుపోయింది. ఒడిశా -ఆంధ్రా సరిహద్దులోని మల్కాన్‌గిరి జిల్లాలో జరిగిందీ ఘటన.
Also Read : తిరుపతిలో కన్ను తెరిచిన శివయ్య.. గతంలో ఇలాంటి ఘటనలు ఎక్కడెక్కడ జరిగాయో తెలుసా?
Also Read : IVF బిడ్డను కనడానికి ముందు.. సరైన డైట్ పాటించడం ఎందుకు కీలకమో తెలుసా..?
Odisha Child Incident
మల్కాన్‌గిరి జిల్లా కోరుకొండ గ్రామానికి చెందిన ప్రదీప్ బిశ్వాస్ అనే వ్యక్తి ఇంటికి కొత్త బిందె కొని తెచ్చాడు. తండ్రి తెచ్చిన ఆ బిందెతో మూడేళ్ల చిన్నారి తన్మయ్ ఆడుకుంటుండగా తల అందులో ఇరుక్కుపోయింది. కుటుంబ సభ్యులు ఎంత ప్రయత్నించినా బాలుడి తల బిందె నుంచి బయటకి రాలేదు. స్థానికంగా ఉన్న అగ్నిమాపక సిబ్బంది కూడా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో వారు చిన్నారిని జిల్లాలోని అగ్నిమాపక కేంద్రానికి తరలించారు. అక్కడ దాదాపు రెండు గంటల పాటు శ్రమించిన సిబ్బంది.. తన్మయ్‌కు ఎలాంటి గాయం కాకుండా కట్టర్ సహాయంతో బిందెను తొలగించారు. రెండు గంటల పాటు బిందెలో తల ఇరుక్కుపోయి బాధపడుతున్న చిన్నారికి ఉపశమనం లభించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Also Read : తిరుపతిలో కన్ను తెరిచిన శివయ్య.. గతంలో ఇలాంటి ఘటనలు ఎక్కడెక్కడ జరిగాయో తెలుసా?
Also Read : తండ్రైన ‘ఛావా’ నటుడు.. మగబిడ్డకు స్వాగతం
head | child | odisha-police | in-odisha