/rtv/media/media_files/2026/01/08/fotojet-2026-01-08t214315872-2026-01-08-21-43-50.jpg)
YouTuber arrested for child sexual abuse videos
Cybercrime police : మైనర్లతో లైంగిక వేధింపుల వీడియోలు చేస్తూ, వారి ఇంటర్వ్యూలు యూట్యూబ్‌లో ప్రచారం చేసిన ఏపీకి చెందిన యూట్యూబర్ కంబేటి సత్యమూర్తిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు విశాఖపట్నం లోని విశాలాక్షినగర్‌కు చెందినవాడుగా గుర్తించారు. ఇతడు వైరల్ హబ్ అనే యూట్యూబ్ ఛానెల్‌ను నిర్వహిస్తూ.. అభ్యంతరకరమైన, పిల్లలపై లైంగిక వేధింపులను ప్రోత్సహించేలా వీడియోలను అప్‌లోడ్ చేస్తున్నాడు.
'వైరల్ హబ్ 007' పేరుతో ఉన్న యూట్యూబ్ ఛానల్‌లో చాలారోజులుగా ఆయన పలువురు బాలలను ఇంటర్వ్యూలు చేస్తున్నారు. అయితే, అందులో మైనర్లతో అశ్లీల ఇంటర్వ్యూలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. 2025 అక్టోబరు 16న తన ఛానల్‌లో పిల్లలపై లైంగిక వేధింపులకు సంబంధించిన వీడియోలు ప్రసారం చేసినట్లు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. దీంతో వారు సుమోటోగా కేసు నమోదు చేశారు.
ఏపీకి చెందిన కంబేటి సత్యమూర్తి రన్ చేస్తున్న సదరు యూట్యూబ్ ఛానల్‌లో 18 ఏళ్ల లోపున్న మైనర్ల ఇంటర్వ్యూలు కూడా ఉన్నాయని పోలీసులు తెలిపారు. వీటిలో నిందితుడు కావాలనే పిల్లలను అసభ్యకరమైన, లైంగికపరమైన అశ్లీల ప్రశ్నలు అడగటమే కాకుండా.. మైనర్లు ముద్దులు పెట్టుకునేలా ప్రేరేపించినట్లు విచారణలో వెల్లడైందన్నారు. ఇదంతా తన ఛానల్‌లో వ్యూస్ పెంచుకోవడానికి ఆయన ఇలాంటి ఇంటర్వ్యూలు చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.
సత్యమూర్తి 2018 నుంచి యూట్యూబర్‌గా పనిచేస్తూ.. వైరల్‌హబ్007 అనే యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నాడు. సామాజిక మాధ్యమ ఇన్‌ఫ్లూయెన్సర్లతో అసభ్య భాషలో ఇంటర్వ్యూలు చేసి, వ్యూస్ పెంచుకొని ఆదాయం పెంచుకోవాలనే ఉద్దేశంతోనే ఇలాంటి వీడియోలు చేసినట్లు పోలీసులు ఆరోపించారు.
ఇతడు బాలల రక్షణ చట్టాలు, సైబర్ చట్టాన్ని ఉల్లంఘించాడని చెప్పారు. సైబర్ ఏసీపీ శివమారుతి పర్యవేక్షణలో ఎస్‌ఐ సురేశ్ తమ బృందంతో కలిసి నిందితుడు సత్యమూర్తిని వైజాగ్‌లో అరెస్టు చేసి హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. నిందితుడిని డిజిటల్ ఎవిడెన్స్ తో అదుపులోకి తీసుకుని పోక్సో, ఐటీ చట్టాల కింద కేసు నమోదు చేశారు. పోలీసుల విచారణలో వ్యూవ్స్ పెంచుకునేందుకే అలాంటి ఇంటర్వ్యూలు చేసినట్టు సత్యమూర్తి ఒప్పుకున్నాడు.
Follow Us