Child Hunger
Child Hunger: పిల్లలు తినడం లేదని తల్లిదండ్రులు తరచూ ఫిర్యాదు చేస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో వాళ్లు బలవంతంగా తిన్నా.. తినే పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది. ఇది చాలా సాధారణమైన సమస్యగా కనిపించినప్పటికీ దీని ప్రభావాలు పిల్లల శారీరక, మానసిక అభివృద్ధికి సరైన పోషకాహారం ఇబ్బందిగా ఉంటుంది. దానికి తోడు కడుపు నిండా తినడం ద్వారా శక్తి, ఆరోగ్యం, ఎదుగుదల వంటివి సమర్థంగా కొనసాగుతాయి. దీనిని సాధించాలంటే తల్లిదండ్రులు కొన్ని చిన్నచిన్న మార్గాలను అనుసరించడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఆ విషయాల గురించి కొన్ని ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
శరీరానికి కావలసిన పోషకాలు:
పిల్లలు భోజనం చేసేటప్పుడు బోలెడంత కోపంగా ఉంటారు. అలాంటి సమయంలో వారి దృష్టిని భోజనంపై నిలిపే బదులు టీవీ, ఫోన్ వంటివాటికి మళ్లించడం ఒక తాత్కాలిక పరిష్కారంగా అనిపించినా, దీర్ఘకాలికంగా చూస్తే అది ఆరోగ్యపరంగా నష్టం చేస్తుంది. పిల్లలు ఆహారాన్ని చూసి తినడం అవసరం. దాని వాసనను అనుభవించాలి, రుచిని ఆస్వాదించాలి. ఇలా చైతన్యంతో తినడం వల్ల శరీరానికి కావలసిన మోతాదులో పోషకాలు అందుతాయి. పిల్లలు కుటుంబంతో కలిసి కూర్చొని తినే అలవాటు పెడితే.. వారి భోజనానికి ఓ శృతి, ఓ ఆనందం కలుగుతుంది. ప్రతి రోజు ఒకే సమయంలో భోజనం చేసే విధంగా అలవాటు చేయాలి. అలాంటి నియమిత జీవనశైలి వల్ల ఆకలి తగిన సమయంలో వస్తుంది.
ఇది కూడా చదవండి: ఈ వంటల్లో జీలకర్ర వాడితే డేంజర్...రుచిపోవడమే కాదు.. ఆరోగ్యానికి కూడా..!
అలాగే ప్రతిరోజూ ఒకే రకమైన ఆహారం వండితే పిల్లలు బోర్‌గా ఫీలవుతారు. అందుకే వారికిష్టమైన రుచులను, వేరియేషన్లను వాడాలి. ఇంట్లోనే వీధి ఆహారపు హెల్తీ వెర్షన్లను తయారు చేసి ఇవ్వడం ద్వారా పిల్లల ఆసక్తిని పెంచవచ్చు. పిల్లల శారీరక చురుకుదనం ఆకలిని ప్రభావితం చేస్తుంది. వారు ఇంట్లో టీవీ ముందు కూర్చునే బదులు బహిరంగ ప్రదేశాల్లో ఆడేందుకు పంపితే.. వారి జీవక్రియ బాగా పనిచేస్తుంది. వ్యాయామం, నాట్యం వంటి శారీరక కృషి వారికి ఆకలి పుట్టేలా చేస్తుంది. జున్ను రోల్స్, చాట్ మసాలా, ఆకర్షణీయంగా కట్ చేసిన కూరగాయలు పిల్లల దృష్టిని ఆకర్షిస్తాయి. ఈ విధంగా చిన్నతనం నుండే ఆరోగ్యకరమైన అలవాట్లు అలవాటు చేస్తే.. పిల్లలు ఆనందంగా తింటారు, ఆరోగ్యంగా పెరుగుతారని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: నిమ్మకాయను ప్రతి దానిలో కలిపి తినకూడదు..ఎందుకో తెలుసా..?
( health tips in telugu | latest health tips | best-health-tips | latest-news)