నిజాం కూడా నీలాగా చేయలేదు.. అమోయ్ కుమార్ పై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు
వివాదాస్పద ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్ పై తెలంగాణ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. నిజాం రాజు కూడా ఆయనలా భూములు కట్టబెట్టలేదని సీరియస్ కామెంట్స్ చేసింది. భూదాన్ భూముల పరిరక్షణలో విఫలమయ్యారని గత బోర్డుతో సహా అధికారులపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది.