Uttar pradesh : మోసగాళ్లకు మోసగాళ్లు.. సీబీఐ అధికారులమంటూ కోటి దోచేశారు!

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, శ్యామ్, సుధీర్, రజనీష్ మహేంద్ర అనే నలుగురు వ్యక్తులు సీబీఐ అధికారులుగా నటిస్తూ డిజిటల్ అరెస్ట్ చేస్తామని ప్రజలను బెదిరించి వారి నుంచి డబ్బులు వసూలు చేసి మోసాలకు పాల్పడుతున్నారు.

New Update
cbi cyber crime
సైబర్ నేరగాళ్లు రోజు రోజుకూ పెట్రేగిపోతున్నారు. రిటైర్డ్ ఉద్యోగులు, వృద్ధులను టార్గెట్ చేసి లక్షల్లో దోచేస్తున్నారు. డిజిటల్ అరెస్ట్ అంటూ భయపెట్టి డబ్బులు గుంజేస్తున్నారు. ఇప్పటికి అలాంటివి చాలా ఘటనలు జరిగాయి. పోలీసులు వీటిపై అవగాహనా కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ తరచూ ఎక్కడో ఒక దగ్గర ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా అలాంటిదే మరొకటి జరిగింది. 
సీబీఐ అధికారులుగా నటిస్తూ మోసాలకు పాల్పడుతున్న నలుగురిని యూపీ పోలీసులు అరెస్ట్ చేశారు.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, శ్యామ్, సుధీర్, రజనీష్ మహేంద్ర అనే నలుగురు వ్యక్తులు సీబీఐ అధికారులుగా నటిస్తూ డిజిటల్ అరెస్ట్ చేస్తామని ప్రజలను బెదిరించి వారి నుంచి డబ్బులు వసూలు చేసి మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కి చెందిన రిటైర్డ్ శాస్త్రవేత్త శుక్దేవ్ నందిని నుంచి దాదాపుగా రూ.1.29 కోట్లు వసూలు చేశారు. అయితే డబ్బులు ఇచ్చాక మోసాన్ని గ్రహించిన ఆ రిటైర్డ్ శాస్త్రవేత్త బరేలీ సైబర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.  ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టి  నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు.  

హైదరాబాద్  లో కూడా

ఇలాంటి ఘటనే హైదరాబాద్  లో కూడా చోటుచేసుకుంది.  హైదరాబాద్‌కు చెందిన ఓ వృద్ధుడిని సైబర్ కేటుగాళ్లు భయపెట్టారు. మనీలాండరింగ్ కేసు నమోదైందని.. డిజిటల్ అరెస్టు అంటూ వృద్ధుడిని భయపెట్టి అతడి నుంచి రూ.53 లక్షలు కాజేశారు. హైదారాబాద్‌లోని అమీర్‌పేటకు చెందిన 77 ఏళ్ల వృద్ధుడికి గత నెల 18న వీడియో కాల్ వచ్చింది. అందులో అవతలి తనను పరిచయం చేసుకున్నాడు. తన పేరు రాజీవ్ కుమార్ అని.. తాను ఢిల్లీ డీసీపీ అని తెలిపాడు. అనంతరం ఆ వృద్దుడిని భయపెట్టాడు. మనీలాండరింగ్ కేసు నమోదు అయిందని.. అందువల్ల మీ పేరుతో అరెస్టు వారెంటీ జారీ చేశామని వృద్ధుడిని భయపెట్టాడు. ఆ బాధిత వృద్ధుడు సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
Advertisment
Advertisment
తాజా కథనాలు