MUDA land case : సీఎం సిద్ధరామయ్యకు బిగ్ రిలీఫ్.. పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు!

ముడా కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు బిగ్  రిలీఫ్ దొరికింది. ఈ కేసును లోకాయుక్త పోలీసుల నుంచి సీబీఐ దర్యాప్తుకు బదలీ చేసేందుకు కోరుతూ దాఖలైన పిటిషన్‌ను జస్టిస్ ఎం నాగప్రసన్న నేతృత్వంలోని కోర్టు ధర్మాసనం కొట్టివేసింది.

New Update
MUDA land case

MUDA land case

ముడా కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు బిగ్  రిలీఫ్ దొరికింది. ఈ కేసును లోకాయుక్త పోలీసుల నుంచి సీబీఐ దర్యాప్తుకు బదలీ చేసేందుకు కోరుతూ దాఖలైన పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు శుక్రవారం కొట్టివేసింది.  ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. కర్ణాటక లోకాయుక్త పోలీసుల వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తడం లేదని జస్టిస్ ఎం నాగప్రసన్న నేతృత్వంలోని కోర్టు ధర్మాసనం పేర్కొంది.

ఈ కేసును సీబీఐకి బదిలీ చేయాల్సిన అవసరం లేదని సూచించింది. విచారణ సందర్భంగా పిటిషన్ వేసిన వ్యక్తికి దర్యాప్తు సంస్థను ఎంపిక చేసే హక్కు లేదని కోర్టు పేర్కొంది. దీంతో పటిషనర్ స్నేహమయి కృష్ణ సుప్రీంకోర్టును ఆశ్రయించాలని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ కేసులో అవినీతి ఆరోపణలతో సిద్ధ రామయ్య తన పదవికి రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలను సీఎం సిద్ధరామయ్య ఖండించారు.

ముడా స్కామ్ ఏంటీ? 

కాగా  సిద్ధరామయ్య తన భార్య పార్వతమ్మ పేర ఉన్న కొన్ని భూములను గతంలో అభివృద్ధి పనుల కోసం మైసూర్​అర్బన్​డెవలప్​మెంట్​అథారిటీ (ముడా) సేకరించింది. దీంతో ముడా ఆమెకు వేరే చోట భూమి కేటాయించింది. సిద్ధ రామయ్య సీఎంగా ఉన్న సమయంలో ఇదంతా జరిగింది. దీంతో సీఎం సిద్ధ రామయ్య ఖరీదైన స్థలాలను సొంత ఫ్యామిలీకి కేటాయించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. కొందరు సామాజిక కార్యకర్తలు ఈ ఇష్యూపై గవర్నర్‎కు ఫిర్యాదు చేశారు .దీంతో సిద్ధరామయ్యను విచారించాలని గవర్నర్ ఆదేశాలు ఇచ్చారు.  ఈ కేసులో సిద్ధరామయ్యను ప్రధాన నిందితుడిగా, ఆయన భార్య పార్వతి రెండవ నిందితురాలిగా ఆరోపణలు ఎదురుకుంటున్నారు.  

Also Read :  Telangana cabinet : బీసీలకు సీఎం రేవంత్‌ గుడ్‌ న్యూస్‌.. పొన్నం, నీలం మధులకు కీలక పదవులు!

Advertisment
తాజా కథనాలు