జమ్మూకశ్మీర్ మాజీ గవర్నర్‌పై సీబీఐ చార్జిషీట్

జమ్మూకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్‌పై సీబీఐ చార్జ్‌షీట్ విడుదల చేసింది. ఆయన 2018 ఆగస్టు నుంచి 2019 అక్టోబర్ వరకు జమ్ముకశ్మీర్ గవర్నర్‌గా ఆయన ఉన్నారు. ఆ సమయంలో అవినీతికి పాల్పడ్డారని సత్యపాల్ మాలిక్‌పై ఆరోపణలు వచ్చాయి.

New Update
Satyapal Malik

సత్యపాల్ మాలిక్ 2018 ఆగస్టు 23 నుంచి 2019 అక్టోబర్ 30 వరకు జమ్ముకశ్మీర్ గవర్నర్‌గా ఆయన ఉన్నారు. కిష్త్వార్‌లో రూ.2,200 కోట్ల కిరు జలవిద్యుత్ ప్రాజెక్ట్ టెండర్ల ప్రక్రియలో అక్రమాలు జరిగినట్లు సత్యపాల్‌ మాలిక్‌ గతంలో ఆరోపించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన 2 ఫైళ్లను క్లియర్ చేయడానికి తనకు రూ.300 కోట్ల లంచం ఆఫర్ చేశారని 2022లో సంచలన వ్యాఖ్యలు చేశారు. 2022 ఏప్రిల్‌లో సీబీఐ కేసు నమోదు చేసింది. సత్యపాల్ మాలిక్‌పై నమోదైన అవినీతి కేసులో సీబీఐ గురువారం చార్జిషీట్ దాఖలు చేసింది.

దర్యాప్తులో భాగంగా 2024 ఫిబ్రవరిలో ఢిల్లీ, జమ్ముకశ్మీర్‌లోని సత్యపాల్‌ మాలిక్ నివాసాలతో పాటు 30కు పైగా ప్రదేశాల్లో సీబీఐ సోదాలు నిర్వహించింది. మాలిక్ సహచరులు, కిరు జలవిద్యుత్ ప్రాజెక్టు సంస్థ చీనాబ్ వ్యాలీ పవర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్‌ లిమిటెడ్‌తో సంబంధం ఉన్న అధికారులను కూడా సీబీఐ లక్ష్యంగా చేసుకున్నది. ఇ-టెండరింగ్ ద్వారా ప్రాజెక్టును తిరిగి టెండర్ చేయాలని బోర్టు మీటింగ్‌లో నిర్ణయం తీసుకున్నప్పటికీ అది అమలు కాలేదని, చివరకు కాంట్రాక్టును పటేల్ ఇంజనీరింగ్ లిమిటెడ్‌కు అప్పగించారని, ఇందులో అక్రమాలు జరిగాయని సీబీఐ ఆరోపించింది. ఈక్రమంలోనే కేంద్ర దర్యాప్తు సంస్థ చార్జిషీట్ విడుదల చేసింది.

( satyapal-malik | jammu-kashmir | latest-telugu-news)

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు