CBI: సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసు క్లోజ్

ధోనీ యాక్టర్ దివంగత హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసును సీబీఐ క్లోజ్ చేసింది. దీనికి సంబంధించి క్లోజ్ రిపోర్ట్ ను కోర్టులో దాఖలు చేసింది. సుశాంత్ మృతిలో ఎటువంటి కుట్రకోణం లేదని అందులో తెలిపింది. 

New Update
hero

Susanth singh rajputh

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‎పుత్ జూన్ 14, 2020న ముంబై బాంద్రాలోని తన నివాసంలో అనుమానస్పద స్థితిలో మరణించాడు. అప్పటి వరకు సక్సెస్ ఫుల్ గా సినిమాలు చేస్తూ బాగానే ఉన్నాడు అనుకున్న సుశాంత్ సడెన్ గా ఉరేసుకుని చనిపోవడం సంచలనానికి దారి తీసింది. ఇది బాలీవుడ్ తో పాటూ దేశ వ్యాప్తంగా దుమారం రేపింది. సుశాంత్ మరణం వెనుక కుట్రకోణం ఉందని పెద్ద ఎత్తున ఆరోపణలు ఎదురయ్యాయి. పోలిటీషియన్స్, బాలీవుడ్ మాఫియా , నెపోటిజం ఇలా రకరకాల కారణాలు బయటకు వచ్చాయి. దాంతో పాటూ డ్రగ్స్ కోషం కూడా వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే నటి రియా చక్రవర్తి, ఇతరులు కలిసి సుశాంత్‎ను ఆత్మహత్యకు ప్రేరేపించడంతో పాటు ఆర్థిక మోసం, మానసిక వేధింపులకు గురి చేశారని సుశాంత్ తండ్రి కెకె సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆమెపై కేసు నమోదయింది. దీనికి కౌంటర్ నటి రియా  చక్రవర్తి సుశాంత్ సింగ్ సోదరీమణులపై ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. వాళ్లు నకిలీ మెడికల్ ప్రిస్క్రిప్షన్ ఇవ్వడం వల్లే సుశాంత్ మరణించాడని రియా ఫిర్యాదులో చెప్పింది. మొత్తానికి ఈ కేసు దేశ వ్యాప్తంగా ఇష్యూ అవడంతో...దీనిని మహారాష్ట్ర ప్రభుత్వం సీబీఐకు అప్పగించింది. 

కేస్ క్లోజ్..

ఐదేళ్ల పాటూ సుదీర్ఘ విచారణ జరిపిన సీబీఐ సుశాంత్ సింగ్ మరణంపై లోతుగా పరిశీలించింది, విచారణ చేసింది. దాదాపు ఐదేళ్ల పాటు సుశాంత్ కేసును ఇన్విస్టిగేట్ చేసిన సీబీఐ క్లోజ్ రిపోర్ట్ ను  దాఖలు చేసింది. సుశాంత్ మరణం వెనక ఎలాంటి కుట్ర లేదని సీబీఐ తేల్చింది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంతో నటి రియా చక్రవర్తికి ఎలాంటి సంబంధం లేదని సీబీఐ ఆమెకు క్లీన్ చిట్ ఇచ్చింది. సుశాంత్ మరణానికి వెనక కుట్ర ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని తేల్చి చెప్పింది. సుశాంత్ కుటుంబ సభ్యులపై రియా చక్రవర్తి దాఖలు చేసిన కేసును కూడా సీబీఐ క్లోజ్ చేసింది. 

 today-latest-news-in-telugu | bollywood | hero | cbi

Also Read: America: అమెరికాలో మరోసారి కాల్పులు...ముగ్గురు మృతి..15 మందికి తీవ్ర గాయాలు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు