Warangal Husband Murder Incident Update | నానమ్మను పొలాల్లో బట్టల్లేకుండా | Villagers Reveled Facts
BREAKING: యువతి ఫిర్యాదు.. ఆర్సీబీ బౌలర్‌పై కేసు నమోదు!
యూపీలో ఆర్సీబీ బౌలర్ యశ్ దయాళ్‌పై కేసు నమోదైంది. ఘజియాబాద్‌కు చెందిన ఓ యువతి లైంగిక వేధింపులు, దోపిడీ ఆరోపణలతో సీఎం గ్రీవెన్స్ పోర్టల్‌లో యశ్‌పై ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 69 కింద కేసు నమోదు చేశారు.
BREAKING: ఏపీ హైకోర్టులో వైఎస్ జగన్ క్వాష్ పిటిషన్!
సింగయ్య మృతి కేసులో ఏపీ మాజీ సీఎం జగన్ హైకోర్టును ఆశ్రయించారు. సింగయ్య మృతిపై హైకోర్టులో జగన్ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. తనపై నమోదైన కేసులు కొట్టివేయాలని పిటిషన్ వేశారు. పిటిషన్‌ను రేపు విచారిస్తామని హైకోర్టు వెల్లడించింది.
లిక్కర్ స్కామ్ లో కయాదు లోహర్ | Kayadu Lohar in liquor scam | Impact on her next films | RTV
Rajasthan: తెరపైకి మరో సారి కృష్ణజింకల కేసు..రాజస్థాన్ ప్రభుత్వం సవాల్
కృష్ణజింకల వేట కేసు మరోసారి తెరపైకి వచ్చింది. యాక్టర్స్ సైఫ్ అలీఖాన్, టబు , నీలం, సోనాలీ బింద్రేలను నిర్దోషులుగా తేల్చుతూ కింది కోర్టు ఇచ్చిన తీర్పును రాజస్థాన్ ప్రభుత్వం తాజాగా హైకోర్టులో సవాల్ చేసింది.
Salman Rushdie: సల్మాన్ రష్దీపై హత్యాయత్నం నిందితుడికి 25 ఏళ్ళ జైలు శిక్ష
అంతర్జాతీయ రచయిత, బుకర్ ప్రైజ్ విజేత సల్మాన్ రష్దీపై హత్యాయత్నం కేసులో తీర్పు తీరోజు వెల్లడైంది. ఈ కేసులో దోషిగా ఉన్న న్యూజెర్సీకి చెందిన హాది మతార్ కు 25 ఏళ్ళు జైలు శిక్ష విధించారు. 2022లో జరిగిన దాడిలో సల్మాన్ రష్దీ ఓ కన్ను కోల్పోయారు.
BIG BREAKING: మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై కేసు నమోదు
మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కుటుంబ సభ్యులపై అటవీ శాఖ అధికారులు కేసు నమోదు చేశారు. మంగళంపేటలో ఉన్న అటవీ భూమిలోకి అక్రమంగా ప్రవేశించి 27.98 ఎకరాలను కబ్జా చేసినట్లు విచారణలో తేలింది. ఈ క్రమంలో పోలీసులు కేసు నమోదు చేశారు.
Jethwani case: జెత్వానీ కేసులో బిగ్ ట్విస్ట్.. IPS ఆఫీసర్ అరెస్ట్!
ముంబై నటి జెత్వానీ కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులును పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీ సీఐడీ అధికారులు అతన్ని హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పనిచేశారు.