/rtv/media/media_files/2025/05/14/W5V7cYqMjsrfVDs6mcov.jpg)
BREAKING NEWS
మాజీ మంత్రి పేర్ని నానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీ నేత సుబ్బన్నను విచారణ కోసం మచిలీపట్నం పోలీసు స్టేషన్‌కు పిలిచారు. ఈ సమయంలో పేర్ని నాని సీఐ విధులకు ఆటంకం కలిగించడంతో పాటు అతనితో వాగ్వాదం పెట్టుకున్నారు. ఈ క్రమంలో ఆర్.పేట సీఐ ఏసుబాబుపై పేర్ని నాని దౌర్జన్యం చేశారని చిలకలపూడి పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. పేర్ని నానితో పాటు మరో 29 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇది కూడా చూడండి: BREAKING: అనకాపల్లిలో జగన్ పర్యటన ఫుల్ రూట్ మ్యాప్ ఇదే!
మాజీ మంత్రి పేర్ని నానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీ నేత సుబ్బన్న అరెస్టు మీదమచిలీపట్నం ఆర్‌ఆర్‌పేట పోలీసు స్టేషన్‌లో సీఐ, పేర్ని నాని మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో పోలీసులు విధులకు ఆటంకం కలిగించారని నానితో పాటు మరో 29 మందిపై కేసు నమోదు చేశారు. Read More >>…
— RTV (@RTVnewsnetwork) October 11, 2025
పేర్ని నానితో పాటు మరో 29 మంది..
వైసీపీ నేతలు పేర్ని నాని ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల దగ్గర ఇటీవల నిరసన చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే కళాశాలలో పరీక్షలు జరుగుతున్నాయని, నిరసన తెలిపేందుకు అనుమతి లేదని పోలీసులు చెప్పారు. అయినా కూడా వినకుండా గొడవ పడ్డారు. ఈ ఘటనలో పోలీసులు 400 మందిపై కేసు నమోదు చేసి 41ఏ నోటీసులు ఇచ్చారు. వెంటనే విచారణకు రావాలని ఆదేశించారు. కానీ ఎవరూ కూడా తాము చెప్పేవరకు విచారణకు వెళ్లవద్దని వైసీపీ నగర అధ్యక్షుడు మేకల సుబ్బన్న సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీంతో వెంటనే సుబ్బన్నను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో పేర్ని నాని మచిలీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. డైరెక్ట్‌గా సీఐ దగ్గకు వెళ్లి బెదిరించారు. మిగతా వారు కూడా పోలీసులను తక్కువ చేసి మాట్లాడారు. ఇలా మాట్లాడకూడదని చెప్పినా సీఐ ఏసుబాసుపై రెచ్చిపోయారు. దీంతో పోలీసులు పేర్ని నానితో పాటు మరో 29 మందిపై కేసు నమోదు చేశారు.
మచిలీపట్నం పోలీసు స్టేషన్ లో పోలీసులపై రెచ్చిపోయిన పేర్ని నాని
— Telugu360 (@Telugu360) October 10, 2025
మెడికల్ కాలేజ్ కోసం చేపట్టిన ధర్నాలో పాల్గొన్న వైసీపీ కార్యకర్తలను వేధిస్తున్నారని సీఐపై దురుసు ప్రవర్తన
నాయకులను, కార్యకర్తలను అకారణంగా ఇబ్బంది పెడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వార్నింగ్#PerniNanipic.twitter.com/XtvkWkDlXa
ఇది కూడా చూడండి: YS Jagan : చంద్రబాబుతో చేతులు కలిపిన స్పీకర్ తలదించుకోవాలి : జగన్