/rtv/media/media_files/2024/11/05/ScnuYgh1QmmOCFa5FDSW.jpg)
Aghori:
లేడీ అఘోరీ(lady aghori) అలియాస్ శ్రీనివాస్‌ను కరీంనగర్ కోర్టుకు తరలించారు. కొత్తపల్లి పీఎస్‌లో మే5న అఘోరీపై కేసు నమోదైన విషయం తెలిసిందే. తనను మోసం చేశాడని రాధిక అనే మహిళ ఫిర్యాదు చేసింది. అఘోరీపై రెండు కేసులు నమోదైయ్యాయి. ప్రొడ్యూసర్‌ను బెదిరించి డబ్బులు తీసుకున్నందుకు ఓ కేసు, రాధిక అనే మహిళను వివాహం చేసుకుంటానని మోసం చేశాడని పోలీసులను ఆశ్రయించింది. ఈ విషయంలో కూడా అఘోరీపై కేసు ఫైల్ చేశారు.
ఫ్రొపెసర్‌ను బెదిరించిన కేసులో అఘోరీకి మే5న కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం యువతిని మోసం చేసిన కేసులో 14 రోజుల జుడీషియల్ రిమాండ్‌లో ఉంది. ఈ కేసులో కూడా అఘోరీ బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నాడు. ఈ కేసును అడ్వకేట్ లక్ష్మణరావు వాదిస్తున్నాడు.
Also Read:హైదరాబాద్‌లో విషాదం... సైబర్ నేరగాళ్ల మోసానికి ఏపీ మహిళ ఆత్మహత్య
కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో లేడీ అఘోరి, శ్రీ వర్షిణి(sri varshini) వ్యవహారం సంచలనం రేపింది. వీరి మొత్తం వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. అనంతరం అఘోరీని పోలీసులు అరెస్ట్ చేశారు. అదే సమయంలో శ్రీవర్ణిణీకి దాదాపు 45 రోజుల పాటు కౌన్సిలింగ్ ఇచ్చి ఇటీవలే రిలీజ్ చేశారు.
Also Read:చెడు కలలతో టార్చర్‌గా ఉందా..? ఈ పని చేయడం మానేస్తే చాలా..!!
ఇక బయటకొచ్చిన శ్రీవర్షిణి కొద్ది రోజులు ఎవరికీ కనిపించలేదు. కానీ ఇప్పుడు వర్షిణీ బాగా మారిపోయింది. పాత లుక్ మొత్తం మార్చేసింది. తాజాగా కొత్త లుక్‌లో దర్శనమిచ్చింది. హేర్ కట్‌తో బర్గర్ టైమ్ అంటూ న్యూ లుక్‌లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది.
Also Read: పాక్ గూఢచారి జ్యోతికి రాచమర్యాదలు...ఏకంగా ఆ రాష్ట్ర అతిథిగా....కేరళ శారీలో..