/rtv/media/media_files/2025/05/17/BSqxAi5OKk6enm7cIHkY.jpg)
Black Buck Case, Bollywood
నేరకపోయి ఇరుక్కున్నాము అని తలకొట్టుకుంటున్నారు బాలీవుడ్ నటులు. 27 ఏళ్ళు అయినా కృష్ణ జింక వేట కేసులో నుంచి బయటపడలేక గిలగిలలాడుతున్నారు. ఈ కేసులో ముఖ్యఆరోపణలు ఎదుర్కొంటున్న సల్మాన్ ఖాన్ కు అయితే ప్రాణాలు పోయే పరిస్థితి. మరవైపు మిగతా బాలీవుడ్ నటుల మీద కూడా ఇప్పుడు ఈ కేసు మీదపడింది. కృష్ణ జింక వేట కేసులో కింది కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాజస్థాన్ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. ఇందులో సైఫ్ అలీఖాన్ , టబు , నీలం, సోనాలీ బింద్రేలు నిందితులుగా ఉన్నారు. కింది కోర్టు వీరిని నిర్దోషులుగా తేల్చింది. అయితే ఇప్పుడు దీన్ని రాజస్థాన్ ప్రభుత్వం హైకోర్టులో సవాల్ చేసింది. దీన్ని ఉన్నత న్యాస్థానం స్వీకరించింది కూడా. ఇదే వ్యవహారంలో పెండింగ్‌లో ఉన్న మిగతా పిటిషన్లతో కలిపి దీన్ని విచారిస్తామని తెలిపింది. తదుపరి విచారణను జులై 28వ తేదీకి వాయిదా వేసింది.
సల్మాన్ కు 5 ఏళ్ళు జైలుశిక్ష..
1998లో హమ్ సాథ్ సాథ్ హై సినిమా షూటింగ్ సందర్భంలో జోధ్ పూర్ పరిసర ప్రాంతాల్లో సల్మాన్, సైఫ్, టబు, నీలం, సోనాలీ బింద్రేలు కృష్ణ జింకలను వేటాడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇందులో సల్మాన్ ఖాన్ గిల్టీగా ప్రూవ్ అవ్వగా..మిగతావారిని కోర్టు నిర్దోషలుగా తేల్చింది. సల్మాన్ కు కోర్టు 5 ఏళ్ళ జైలుశిక్ష కూడా విధించింది. ప్రస్తుతం ఈ శిక్షకు సంబంధించిన వ్యవహారం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది. అయితే మిగతా వారిపై సరైన ఆధారాలు లేవని కింది కోర్టు తేల్చింది.
today-latest-news-in-telugu | bollywood | actors | case
Also Read: J&K: తుల్ బుల్ ప్రాజెక్టుపై రచ్చ..కాశ్మీర్ సీఎం ఒమర్ వర్సెస్ పీడీపీ ముఫ్తీ