KTR Padayatra: త్వరలోనే పాదయాత్ర.. కేటీఆర్ సంచలన ప్రకటన!
TG: కేటీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని బలపరించేందుకు త్వరలో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేయనున్నట్లు ప్రకటించారు. పాదయాత్ర తేదీలను త్వరలోనే ప్రకటిస్తానని చెప్పారు.
అభివృద్ధికి అడ్డంకిగా కాంగ్రెస్ ..? | Hindrance to development Congress | RTV
BRS Party Office : బీఆర్ఎస్ ఆఫీస్ కూల్చివేత..హైకోర్టు సంచలన ఆదేశాలు!
TG: బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. 15రోజుల్లోగా నల్గొండ జిల్లా పార్టీ ఆఫీస్ ను కూల్చివేయాలని ఆదేశాలు ఇచ్చింది. పార్టీ భవనాన్ని కూల్చివేయకుండా ఆదేశాలు ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ వేసిన పిటిషన్ ను కొట్టివేసింది.
BRS Party : కేసీఆర్ చెప్పిందే జరిగింది.. బీఆర్ఎస్ పార్టీ సంచలన పోస్ట్
TG: సంకీర్ణ యుగంలో, కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు స్థానిక పార్టీల మద్దతు కీలకం అయ్యే రోజొకటి వస్తుందని కేసీఆర్ చెప్పిందే జరిగిందని బీఆర్ఎస్ ట్విట్టర్లో పోస్ట్ చేసింది. 16 సీట్లలో కాంగ్రెస్, బీజేపీలను గెలిపిస్తే, ఇద్దరూ కలిసి తెలంగాణకు మొండి చెయ్యి చూపారని పేర్కొంది.
BRS Party: కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థి
TG: బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. తాజాగా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, జహీరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ కారు దిగి కాంగ్రెస్ గూటికి చేరారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో వారు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
BRS Party: కేసీఆర్‌తో కటీఫ్.. కాంగ్రెస్‌లోకి మరో ఎమ్మెల్యే
TG: బీఆర్ఎస్ పార్టీని వరుస ఎమ్మెల్యేల రాజీనామాలు వెంటాడుతున్నాయి. తాజాగా మరో ఎమ్మెల్యే కేసీఆర్‌కు కటీఫ్ చెప్పారు. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కాంగ్రెస్‌లో చేరనున్నారు. ఇప్పటికే 8 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరిన సంగతి తెలిసిందే
BRS Party: బీఆర్ఎస్కు బిగ్ షాక్.. 15 మంది జంప్
TG: మేడ్చల్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ హస్తగతం కానుంది. 15 మంది కార్పొరేటర్లు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాగా ఇటీవల బీఆర్ఎస్ నుంచి ఆరుగురు ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో చేరిన సంగతి తెలిసిందే.
BRS Party: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లు.. విచారణ వాయిదా
TG: తమ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ లో వెళ్లిన నేతలపై వేసిన అనర్హత పిటిషన్‌ను హైకోర్టు విచారణ చేపట్టింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఎమ్మెల్యే దానం, కడియం శ్రీహరి, తెల్లం వెంక్రటావు బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.