/rtv/media/media_files/2025/07/17/kavitha-ktr-2025-07-17-09-04-37.jpg)
BRS ఎమ్మెల్సీ కవిత పార్టీలో అంతర్గత విభేదాల గురించి మరోసారి మీడియా ముందు మాట్లాడారు. బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి ఆఫీస్‌లో హెచ్ఎంఎస్ జనరల్ సెక్రటరీ రియాజ్ అహ్మద్, సింగరేణి జాగృతి, హెచ్ఎంఎస్ నాయకులతో ఎమ్మెల్సీ కవిత సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. అన్న కేటీఆర్, ఆమె మధ్య ఉన్న విభేదాల గురించి మీడియా స్పెషల్ ఫోకస్ పెట్టాల్సిన అవసరం లేదు.. లైట్ తీసుకోండని అన్నారు. అన్నీ రాజకీయ పార్టీల్లోనూ ఏదో ఒక గొడవ ఉందని ఆమె చెప్పుకొచ్చారు. అందుకు ఉదాహరణలుగా అధికార పార్టీలో సీఎం రేవంత్ రెడ్డి, రాజ్‌గోపాల్ రెడ్డి అని చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి ఏదైనా మాట్లాడినా.. అరగంటలోనే రాజగోపాల్‌రెడ్డి దాన్ని ఖండిస్తారని అన్నారు.
అలాగే బీజేపీలోని మరో ఇద్దరు నాయకుల మధ్య విభేదాల గురించి చెప్పుకొచ్చారు. బండి సంజయ్‌కు ఈటల రాజేందర్ డైరెక్ట్‌గా వార్నింగ్ ఇచ్చారని అన్నారు. ఇలా అన్నీ పార్టీల్లో అంతర్గత విభేదాలు ఉన్నాయని కవిత వివరించారు. BRSపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం లేదని మీడియాని కోరారు.
బీఆర్ఎస్ పార్టీని లైట్ తీసుకోండి
— Tharun Reddy (@Tarunkethireddy) August 10, 2025
ఆ పార్టీపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు
- ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత pic.twitter.com/LAsictDKGa
అలాగే సింగరేణి తెలంగాణకు కొంగు బంగారం.. ప్రకృతి ఇచ్చిన వరం అని ఆమె అన్నారు. ఉమ్మడి ఏపీలో తెలంగాణ అనుభవించిన కరువు అందరికీ తెలుసని గుర్తుచేశారు. ఇవాళ సింగరేణి ఏరియా మినీ ఇండియాగా మారిందని చెప్పారు. తెలంగాణ వచ్చాక సింగరేణిలో పనిచేస్తున్న వారికి డిపెండెంట్ ఉద్యోగాలు వచ్చాయి. నేడు 40 వేల మంది ఉద్యోగులు సింగరేణిలో ఉన్నారు. ఇప్పటివరకు కేవలం 18 నుంచి 20శాతం వరకు బొగ్గుమాత్రమే వెలికితీశాము. కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణిలో అండర్ గ్రౌండ్ మైన్స్ ఓపెన్ చేయాలి. ఓపెన్ కాస్ట్‌ల మైన్స్‌తో పెద్ద, పెద్దవాళ్లకు లాభం జరుగుతుంది. సింగరేణి ఉద్యోగులకు ఇన్ కం ట్యాక్స్ రద్దు చేయాలని ఈ సందర్భంగా కవిత డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్రానికి సింగరేణి అనేది కొంగుబంగారం లాంటిది తెలంగాణ రాష్ట్రానికి ప్రకృతి ఇచ్చిన వరప్రసాదం సింగరేణి బొగ్గు.
— @Venkatesh_jaruthii (@TThurupath10117) August 10, 2025
*- జాగృతి అధ్యక్షురాలు బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు* pic.twitter.com/vasSJeliwU
దీనిపై మోడీ ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని అన్నారు. HMS అంటే సుభాష్ చంద్రబోస్ పెట్టిన సంస్థ అని వెల్లడించారు. తెలంగాణలో HMS స్వతంత్ర కార్మిక సంఘంగా ఉందని తెలిపారు. HMSతో కలిసి సింగరేణి జాగృతి పనిచేస్తుందని స్పష్టం చేశారు. సింగరేణి కార్మికుల సంక్షేమం, హక్కుల కోసం పనిచేస్తామని అన్నారు. సింగరేణిలో అంతర్గత ఉద్యోగాలను భర్తీ చేయాలి. కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయాలి. సరైన వేతనాలు ఇవ్వాలి. ఈ డిమాండ్ల అమలు కోసం దసరా తర్వాత సింగరేణి బొగ్గు గనుల ప్రాంతంలో జాగృతి, హెచ్ఎంఎస్ కలిసి యాత్ర చేస్తామని కవిత కీలక ప్రకటన చేశారు. యాత్ర ద్వారా కార్మికుల్లో భరోసా నింపుతామని అన్నారు. ఓపెన్ కాస్ట్‌ల మూలంగా సింగరేణికి నష్టం జరుగుతుంది. దళారుల చేతులనుంచి సింగరేణిని కాపాడాలి. దాదాపు 200 మంది మహిళలు సింగరేణిలో ఉన్నారని అన్నారు.