KTR : ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టో కు కట్టుబడని పార్టీల సభ్యత్వం రద్దు..కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు

ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉండక పోతే ఆ పార్టీని ప్రజలు శిక్షించేలా చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సూచించారు. మంగళవారం న్యూఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో భేటీ అనంతరం కేటీఆర్ మాట్లాడారు.

New Update
KTR

KTR

KTR : ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉండక పోతే ఆ పార్టీని ప్రజలు శిక్షించేలా చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సూచించారు. మంగళవారం న్యూఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో భేటీ అనంతరం కేటీఆర్ విలేకర్లతో మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చక పోతే ఎన్నికైన ప్రజా ప్రతినిధుల సభ్యత్వం రద్దు చేయాలని కేటీఆర్‌ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలపై బాండ్ పేపర్లతో ప్రజలను వంచించిందని మండిపడ్డారు. ఎన్నికల్లో పార్టీలు ఇచ్చే అడ్డగోలు వాగ్దానాలపై ఈసీ దృష్టి సారించాలన్నారు. తెలంగాణలో వేలం పాట లాగా హామీలు ఇచ్చారన్నారు. 420 హామీలు ఇచ్చారు.. చివరకు బాండ్ పేపర్ల పై రాసిచ్చారన్నారు.

ఇది కూడా చూడండి:Hyderabad: హైదరాబాద్ లో కసాయి భర్త.. ప్రియురాలి కోసం భార్య, పిల్లల్ని ఏం చేశాడంటే!


దేశంలో ఎన్నికలు జరుగుతున్న పరిస్థితులు తీసుకురావాల్సిన సంస్కరణలు పై ఎన్నికల సంఘానికి స్వేచ్ఛగా వివరించాం. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాలు బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహిస్తున్నాయి. ఈవీఎం ల విషయంలో అనుమానాలున్నాయి. అందుకే ఓటింగ్ మిషన్లు వద్దని బ్యాలెట్ పేపర్ కి వెళ్ళాయి. మనదేశంలోనూ ఎన్నికల్లో బ్యాలెట్ విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరినట్లు  కేటీఆర్ తెలిపారు. బీహార్ ఎన్నికల నుంచే బ్యాలెట్ పేపర్ ప్రవేశ పెట్టాలని కోరామన్నారు. ఇక బీహార్ ప్రత్యేక ఓటరు సవరణపై కూడా ఈ సందర్భంగా చర్చించామన్నారు. ఓటర్లను ఉద్దేశ పూర్వకంగా తీసేయలేదని ఎన్నికల సంఘం తమకు స్పష్టం చేసిందని వివరించారు.

ఓటరు జాబితా సవరణ మంచిదే కానీ.. అందర్నీ విశ్వాసంలోకి తీసుకొని చేయాల్సి ఉందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. అన్ని పార్టీలను భాగస్వామ్యం చేసి పారదర్శకంగా ఓటరు జాబితా సవరణ చేయాలని సూచించారు. బూత్ లెవల్ కమిటీలతో అఖిల పక్ష కమిటీలను ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఓటర్లను ఎందుకు తీసేస్తున్నారానే కారణాలపై ఎన్నికల సంఘం జాబితా పెట్టాలన్నారు. దొంగ హామీలు, వాగ్దానాలతోపాటు అమలు చేయని హామీలపై సైతం ఈ సందర్భంగా ఈసీతో చర్చించామన్నారు. కారు గుర్తుని పోలిన సింబల్స్ ఉంచకూడదని ఎన్నికల సంఘాన్ని తాము కోరినట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు.ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టో కు రాజకీయ పార్టీలు కట్టుబడి ఉండక పోతే  చర్యలు తీసుకోవాన్నారు.

ఇది కూడా చూడండి:UP crime : ఓరెయ్ కామాంధుడా... ప్రైవేట్ పార్ట్స్ తాకి పారిపోయాడు.. యోగి స్టైల్ ట్రీట్మెంట్ ఇచ్చారు!

భారత దేశంలో ఎన్నికల సంస్కరణలు రావాలి. ఖర్చు, దొంగ హామీలు.. వంటి అంశాలపై చర్చ జరిపాం. కారు గుర్తును పోలిన 8, 9 సింబల్స్ ను తొలగించాలని ఎన్నో ఏళ్లుగా పోరాడుతున్నాం. భువనగిరిలో రోడ్ రోలర్ గుర్తు వల్ల మేం ఓడి పోయామని కేటీఆర్‌ తెలిపారు. కారు గుర్తును పోలిన వాటిని తక్షణమే తొలగించాలని ఆయన డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ బీసీల కు ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చెయ్యడం లేదు.సబ్ ప్లాన్ ఎందుకు పెట్టరు. మీ చేతుల్లో ఉన్న పనులు ముందు చెయ్యండి అని ఆయన మండిపడ్డారు. ఢిల్లీలో డ్రామా లు చేస్తే ఎవ్వరు నమ్మరన్నారు. కాళేశ్వరం నివేదికలో మొత్తం గ్యాస్, ట్రాష్ మాత్రమే ఉంది. ఉద్దేశ్య పూర్వకంగా ప్రచారం చేస్తున్నారన్నారు. కేసీఆర్, బీఆర్ఎస్ పై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. మొత్తం నివేదికను బయట పెట్టాలని, అసెంబ్లీలో నివేదిక పెట్టాలని  కేటీఆర్‌ డిమాండ్‌చేశారు. నివేదికపై అసెంబ్లీలో చీల్చి చెండాడుతామని కేటీఆర్‌ స్పష్టం చేశారు.

ఇది కూడా చూడండి:Wife Killed Husband: పొరిగింటి యువకుడితో ఎఫైర్.. యూట్యూబ్‌లో చూసి భర్తను చంపించిన మహిళ

Advertisment
తాజా కథనాలు