BRS MLCs: ఆ ఎమ్మెల్సీలకు బిగ్‌షాక్‌..పార్టీమారినవారిపై సుప్రీంకోర్టుకు బీఆర్‌ఎస్‌

పార్టీ మారిన బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేల కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో జోష్‌ మీదున్న ఆ పార్టీ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. పార్టీ మారిన ఎమ్మెల్సీల విషయంలోనూ అదే పాలసీని అనుసరించనుంది. వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది.

New Update
BRS MLCs joined the congress

BRS MLCs joined the congress

BRS MLCs: 

పార్టీ మారిన బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేల కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో జోష్‌ మీదున్న బీఆర్ఎస్‌ పార్టీ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్యేలపై అనర్హత వేటుపై 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని సుప్రీం ఆదేశించిన నేపథ్యంలో పార్టీ మారిన ఎమ్మెల్సీల(jumping mlas) విషయంలోనూ అదే పాలసీని అనుసరించారని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పార్టీ నాయకులు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేయాలని సుప్రీంకోర్టు(supreme court) లో పిటిషన్ దాఖలు చేయబోతున్నారు. 

Also read: తెలంగాణ ఆర్టీసీ బంఫర్‌ ఆఫర్‌.. బస్సు ఎక్కితే చాలు..

గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ(BRS Party) ప్రతిపక్ష హోదాకే పరిమితం కావడంతో బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ కండువాలు కప్పుకున్నారు. అయితే ఈ విషయంలో బీఆర్‌ఎస్‌ పార్టీ సుప్రీం కోర్టువరకు వెళ్లింది. దీంతో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై మూడు నెలల్లోగా చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఫిరాయింపు ఎమ్మెల్సీలపై కూడా బీఆర్ఎస్ దృష్టి సారించింది. ఈ విషయంలో కేటీఆర్ స్వయంగా సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయనున్నారు. ఎన్నికల సంఘంతో జరిగిన సమావేశంలో పాల్గొనడానికి వెళ్ళిన కేటీఆర్‌ ఇతర బీఆర్‌ఎస్‌ నాయకులు అక్కడే ఉన్నారు.  కేటీఆర్ వెంట పార్టీ లీగల్ సెల్ బృందం కూడా ఉంది. ఈ క్రమంలో  ఎమ్మెల్సీలపై శాసనమండలి నాయకుడు చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని పార్టీ తరుపున కేటీఆర్‌ సుప్రీం కోర్టులో పిటిషన్‌ వేయనున్నారు. 

Also read: తిరిగి రారా తమ్ముడా.. చితిపైనే తమ్ముడికి రాఖీ కట్టిన అక్క

ఏదేని ఒక పార్టీలో గెలిచి పలు కారణాల వల్ల పార్టీ మారితే నైతికంగా తమ పదవులు వదులుకొని తిరిగి తాము చేరిన పార్టీ నుంచి వారు ఎన్నిక కావలసి ఉంటుంది. ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌ నుంచి వెళ్లిన ఎమ్మెల్సీలు తమ పదవీకి రాజీనామా చేసి కాంగ్రెస్ నుంచి తిరిగి ఎన్నిక కావాలని ఆ పార్టీ డిమాండ్‌ చేస్తోంది, కానీ చట్టబద్ధం కానీ ఫిరాయింపులకుపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టులో పిటిషన్‌  దాఖలు చేయబోతున్నట్లు  బీఆర్‌ఎస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ పేర్కొన్నారు.

పదిమంది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరగా.. బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న కే. కేశవ్ రావు కూడా గతంలోనే కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన చేరిన మరుసటి రోజే  ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్‌లో చేరిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీల్లో బస్వరాజు సారయ్య, భానుప్రసాదరావు, ఎగ్గె మల్లేశం, ఎం.ఎస్.ప్రభాకర్, దండె విఠల్, బొగ్గారపు దయానంద్ తదితరులు ఉన్నారు. అయితే వీరి చేరికను బీఆర్ఎస్ తప్పు పడుతోంది. పార్టీ ఫిరాయింపులపై తప్పకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. ఈ క్రమంలోనే వారిపై చర్యలు తీసుకోవాలని సుప్రీం కోర్టును ఆశ్రయించనుంది.

Also Read :  Love Murder Case : పెళ్లైన వ్యక్తితో సహజీవనం.. కూతుర్ని నరికి చంపిన తండ్రి.. ప్రియుడి పిటిషన్తో..!

Advertisment
తాజా కథనాలు