BRS party : మేం పార్టీ మారడం లేదు.. బిగ్ ట్విస్ట్ ఇచ్చిన మాజీ ఎమ్మెల్యేలు!

తాము పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి,  బీరం హర్షవర్ధన్ రెడ్డి ఖండించారు. పార్టీ అధినేత కేసీఆర్, కేటీఆర్ ఆశీస్సులతో బీఆర్ఎస్ లోనే  కొనసాగుతామని స్పష్టం చేశారు.

New Update
brs party

తాము పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి,  బీరం హర్షవర్ధన్ రెడ్డి ఖండించారు. పార్టీ అధినేత కేసీఆర్, కేటీఆర్ ఆశీస్సులతో బీఆర్ఎస్ లోనే  కొనసాగుతామని స్పష్టం చేశారు. పార్టీ  పటిష్ఠత కోసం తాము  పనిచేస్తామని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తల కోసం, నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసం బీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతానని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాయమని అన్నారు.తమపై కొంతమంది పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 

బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా

కాగా అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే, నాగర్‌కర్నూల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు గువ్వల బాలరాజు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తన రాజీనామా లేఖను ఆయన పార్టీ అధినేత కేసీఆర్ కు పంపించారు.  2023 అసెంబ్లీ ఎన్నికల్లో అచ్చంపేట నుండి పోటీ చేసి గువ్వల బాలరాజు ఓడిపోయారు. ఇటీవల 2024 లోక్‌సభ ఎన్నికల్లో నాగర్‌కర్నూల్ నుంచి ఎంపీ టికెట్ ఆశించి భంగపడ్డారు. ఈ పరిణామాల నేపథ్యంలో, ఆయన బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసినట్లుగా తెలుస్తోంది.  బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత ఆయన భారతీయ జనతా పార్టీ (BJP)లో చేరనున్నట్లు వార్తలు వస్తు్న్నాయి.  గువ్వల బాలరాజు 2007లో బీఆర్ఎస్ (అప్పటి టీఆర్ఎస్) పార్టీలో చేరి క్రియాశీలకంగా పనిచేశారు. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అచ్చంపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. రెండోసారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రభుత్వ విప్‌గా కూడా బాధ్యతలు నిర్వహించారు. అయితే గువ్వల బాలరాజుతో పాటుగా మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి,  బీరం హర్షవర్ధన్ రెడ్డిలు కూడా బీఆర్ఎస్ కు రాజీనామా చేస్తారని ముకుమ్మడిగా అందరూ బీజేపీలో చేరబోతున్నారంటూ  పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీంతో ఇది రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద సంచలనంగా మారింది. 

తాజాగా గువ్వల బాలరాజు ఫోన్ లో ఓ కార్యకర్తతో మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఫోన్ కాల్లో బీఆర్ఎస్ బీజేపీతో పొత్తు పెట్టుకుంటుందని అనే వార్తలు వస్తున్నాయని,  అలాంటప్పుడు తన  అభ్యర్థిత్వం ఎగిరిపోతుందని మాట్లాడారు. గతంలో బీజేపీతో పోరాటం చేసిన వాడినని అన్నారు. బీఆర్ఎస్ కంటే ముందే తన దారి తను చూసుకుని బీజేపీలో కలవడం మంచిదని నిర్ణయం తీసుకున్నట్లుగా  గువ్వల కార్యకర్తకు చెప్పుకొచ్చారు. పార్టీలో తనను కాదని నాగర్ కర్నూల్ ఎంపీ టికెట్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ ఇవ్వడంపై కూడా ఆయన ఫోన్‌లో చర్చించారు. ఒకవైపు కూతురు ఎమ్మెల్సీ కవితతో రాజకీయ పంచాయతీ,  మరోవైపు పార్టీ నేతల ఫిరాయింపులు, ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే రాజీనామాల అంశాలతో ఇక్కట్లు పడుతున్న కేసీఆర్ కు ఇది భారీ ఎదురుదెబ్బ అని చెప్పాలి. 

Advertisment
తాజా కథనాలు