/rtv/media/media_files/2025/08/08/guvvala-2025-08-08-11-16-09.jpg)
బీఆర్ఎస్ పార్టీ(BRS Party) కి రాజీనామా చేసిన అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు(Guvvala Balaraju) బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. 2025 ఆగస్టు 11వ తేదీన ఆయన అధికారికంగా బీజేపీలో చేరనున్నారు. ఇవాళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావును ఆయన కలిశారు. ఈ మేరకు గువ్వల బీజేపీ(BJP) లో చేరబోతున్నట్లుగా రాంచందర్ రావు అధికారికంగా వెల్లడించారు. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశాక మీడియాతో మాట్లాడిన గువ్వల.. తాను బీజేపీలో చేరుతున్నానని ఎవరూ చెప్పారని, కొంతమంది తన మీద లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తనకు కాంగ్రెస్ నుంచి పెద్ద పెద్ద నేతలు పార్టీలోకి రమ్మని పిలుస్తున్నారని గువ్వల అన్నారు. ఇంత చెప్పిన గువ్వల బాలరాజు తిరిగి బీజేపీలోనే రేపు అధికారికంగా చేరబోతుడటం బిగ్ ట్విస్ట్ అనే చెప్పాలి. అయితే గువ్వలతో పాటుగా మరికొంతమంది నేతలు కూడా బీజేపీలో చేరనున్నారని తెలుస్తోంది.
Also Read : తెలంగాణ ఆర్టీసీ బంఫర్ ఆఫర్.. బస్సు ఎక్కితే చాలు..
బిగ్ బ్రేకింగ్ న్యూస్
— Tharun Reddy (@Tarunkethireddy) August 8, 2025
బీజేపీ చీఫ్ రాంచందర్ రావుతో మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు భేటీ
బాలరాజు బీజేపీలో చేరనున్నట్లు ప్రకటించిన
రాంచందర్ రావు
గువ్వలతో పాటు మరికొందరు బీజేపీ తీర్థం
పుచ్చుకునే ఛాన్స్
గువ్వల బాలరాజు విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో చురుకుగా ఉన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి నాయకుడిగా పనిచేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆయన కీలక పాత్ర పోషించారు. TRS ఆవిర్భావం నుంచి కేసీఆర్‌కు అత్యంత సన్నిహితులలో ఒకరిగా ఉన్నారు. 2014, 2018 ఎన్నికల్లో అచ్చంపేట ఎమ్మెల్యేగా గెలుపొందిన బాలరాజు, నాగర్ కర్నూల్ జిల్లా బీఆర్‌ఎస్ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. 2023 ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన పార్టీ కార్యక్రమాలకు కొంత దూరంగా ఉంటూ వచ్చారు. గువ్వల బాలరాజు రాజీనామా బీఆర్‌ఎస్‌కు మరో ఎదురుదెబ్బేనని చెప్పాలి. ఫామ్‌హౌస్ కేసులో తాను పార్టీ ఆదేశాల మేరకే పాల్గొన్నానని, కానీ తనపైనే పార్టీ అధిష్ఠానం తప్పుడు ఆరోపణలు చేసిందని బాలరాజు ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌కు ఎంతో సేవ చేసినప్పటికీ, కష్టకాలంలో తనకు పార్టీ నాయకత్వం అండగా నిలవలేదని ఆయన ఆరోపించారు.
Also Read : తిరిగి రారా తమ్ముడా.. చితిపైనే తమ్ముడికి రాఖీ కట్టిన అక్క
ఆడియో సోషల్ మీడియాలో వైరల్
కాగా తాజాగా గువ్వల బాలరాజు ఫోన్ లో ఓ కార్యకర్తతో మాట్లాడిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఫోన్ కాల్లో బీఆర్ఎస్ బీజేపీతో పొత్తు పెట్టుకుంటుందని అనే వార్తలు వస్తున్నాయని, అలాంటప్పుడు తన అభ్యర్థిత్వం ఎగిరిపోతుందని మాట్లాడారు. గతంలో బీజేపీతో పోరాటం చేసిన వాడినని అన్నారు. బీఆర్ఎస్ కంటే ముందే తన దారి తను చూసుకుని బీజేపీలో కలవడం మంచిదని నిర్ణయం తీసుకున్నట్లుగా గువ్వల కార్యకర్తకు చెప్పుకొచ్చారు. పార్టీలో తనను కాదని నాగర్ కర్నూల్ ఎంపీ టికెట్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ ఇవ్వడంపై కూడా ఆయన ఫోన్‌లో చర్చించారు.