నా బిడ్డను బాధ పెట్టొద్దని 5 లక్షలు ఇస్తే... ! | Marchiyaral Newly Married Couple Sad Story | RTV
పెళ్లి టైమ్ లో వరుడి చెప్పులను దాచిపెట్టి రూ. 50 వేలు అడిగితే రూ. 5వేలు ఇచ్చాడంటూ వధువు బంధువులు పెళ్లి కుమారుడితో గొడవ పెట్టుకున్నారు. మాట మాట పెరగడంతో వరుడిని గదిలో బంధించి మరి కర్రలతో కొట్టారు వధువు తరుపు బంధువులు.
హైదరాబాద్‌లో పెళ్లైన 7రోజులకే నవ వధువు మౌనికను బీజేపీ నేత గురజాల అరవింద్ ఎత్తుకెళ్లడం కలకలం రేపుతోంది. ఇప్పటికే పెళ్లైన అరవింద్ పై కాలనీ వాసులు మండిపడుతూ అతని చిత్రపటానికి చెప్పుల దండేసి నిరసన తెలిపారు. మౌనిక మాత్రం ఇష్టపూర్వకంగానే వెళ్లానంటోంది.
ఎంతో సంతోషంగా పెళ్లి చేసుకున్న ఓ జంట తెల్లారి లేచి చూసేసరికి చనిపోయి కనిపించారు. వధువు మంచంపై పడిపోయి ఉండగా.. వరుడు ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. వధువును చంపి అతను ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
ప్రకాశం జిల్లా కంభం మండలం దేవనగరంలో విషాదం చోటు చేసుకుంది. పసుపు పారాణి ఆరకముందే నవ వధువు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం రెండు రోజుల క్రితమే అదే గ్రామానికి చెందిన వెంకటేష్ తో పెద్దల సమక్షంలో ఘనంగా వివాహమైంది.
యూపీలోని మహారాజ్‌గంజ్ జిల్లాల్లో ఓ కొత్త పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కుటుంబానికి పెద్ద షాకిచ్చింది. పెళ్లి అయిన రాత్రే వరుడి కుటుంబం విందు ఏర్పాట్లలో ఉండగా..కొత్త పెళ్లి కూతురు 3.5 లక్షల విలువైన నగలతో పారిపోయింది.
మహారాష్ట్రంలోని ఠానేకి చెందిన ఓ వ్యక్తి విడాకులు తీసుకున్న మహిళలే లక్ష్యంగా ఏకంగా 20 మందిని పెళ్లి చేసుకున్నాడు. వాళ్ల నుంచి విలువైన నగలు, వస్తువులు, నగదుతో పరారయ్యాడు. ఓ యువతి ఫిర్యాదుతో చివరికి పోలీసులు అతడిని అరెస్టు చేశారు.
పెళ్లి పందిట్లో కాబోయే భార్యకు పెట్టిన ముద్దు వరుడి ప్రాణాల మీదకు వచ్చింది. వరమాల వేయగానే బహిరంగంగా ముద్దు పెట్టడంపై పెళ్లి కూతురు బంధువులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఇరు కుటుంబాలు కర్రలతో కొట్టుకున్న ఘటన యూపీలో చోటుచేసుకుంది.
మలయాళ ముద్దుగుమ్మ నిత్యా మీనన్ పెళ్లి కూతురిగా ముస్తాబైన ఫొటోను షేర్ చేసి అందరిని షాక్ కి గురి చేసింది. ఆ ఫొటో ను చూసిన అభిమానులు నిత్య మీనన్ కి పెళ్లి అయిపోయిందా అంటూ ఆశ్చర్యానికి గురౌతున్నారు. అయితే ఆ చిత్రం తన తరువాత చిత్రానిది అంటూ రాసుకోచ్చింది.