Mahbubnagar : పెళ్లి అయిన మూడు రోజులకే నవవధువు ఆత్మహత్య..బాత్రూమ్లో

నారాయణ పేట జిల్లా కోస్గి మండలం చంద్రవంచ గ్రామానికి చెందిన గొల్ల శ్రీలతకు ..  రంగారెడ్డి జిల్లా భీమవరం గ్రామానికి చెందిన యువకుడితో పెళ్లి జరిపించారు పెద్దలు.

New Update
golla srilatha

పెళ్లి అయిన మూడు రోజులకే నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకరమైన ఘటన నారాయణపేట జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణ పేట జిల్లా కోస్గి మండలం చంద్రవంచ గ్రామానికి చెందిన గొల్ల శ్రీలతకు ..  రంగారెడ్డి జిల్లా భీమవరం గ్రామానికి చెందిన యువకుడితో పెళ్లి జరిపించారు పెద్దలు. అయితే వికారాబాద్‌ జిల్లా దోమ మండలం మోత్కూరులో ఉంటున్న మేనమామ ఇంటికి భర్తతో కలిసి వచ్చింది శ్రీలత. అక్కడ ఎవరూ లేని టైమ్ లో బాత్రూంలో పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు.  

ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ శ్రీలత చనిపోయింది. కాగా చంద్రవంచకు చెందిన సూరి అనే యువకుడి వేధింపులకే తమ సోదరి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుందని మృతురాలి సోదరులు ఆరోపిస్తున్నా రు. బలవంతపు పెళ్లి చేయడంతోనే శ్రీలత ఆత్మహత్య చేసుకుందని మరికొందరు అంటున్నారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.  సూరి మోసం చేసినందుకే శ్రీలత చనిపోయిందని కుటుంబసభ్యులు ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా, అది తమ పరిధిలోకి రాదని ఫిర్యాదు కోస్గి పోలీసులు స్వీకరించలేదని తెలుస్తోంది.

కఠినంగా శిక్షించాలని కుటుంబసభ్యులు డిమాండ్

తమ న్యాయం చేయాలని, నిందితుడిని అదుపులోకి తీసుకుని కఠినంగా శిక్షించాలని కుటుంబసభ్యులు డిమాండ్ చేశారు. తాండూర్- మహబూబ్‌నగర్ జాతీయ రహదారిపై మృతదేహంతో ధర్నాకు దిగారు.  స్థానికంగా ఈ ఘటన సంచలనం సృష్టించింది. 

Advertisment
తాజా కథనాలు