Nagpur Bride: నిత్యపెళ్లికూతురు.. 8 పెళ్లిళ్లు చేసుకుంది.. 9వ సారి...

మహారాష్ట్ర నాగ్‌పూర్‌కు చెందిన సమీరా ఫాతిమా ఉన్నత విద్యావంతురాలు. కానీ డబ్బుల కోసం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 8 పెళ్లిళ్లు చేసుకుంది. వారందరి వద్ద అందినకాడికి దోచుకుంది. 9వ సారి మళ్లీ పెళ్లి పీటలు ఎక్కబోయి పోలీసులకు అడ్డంగా బుక్కయింది.

New Update
The eternal bride has married 8 times.. for the 9th time...

The eternal bride has married 8 times.. for the 9th time...

Nagpur Bride: ఒకసారి పెళ్లి చేసుకుని ఏదైనా కారణాలతో విడిపోయి రెండో మ్యారేజ్ చేసుకోవాలంటేనే అమ్మాయిలు అదోలా ఫీల్ అవుతారు. కానీ, మహారాష్ట్రకు చెందిన ఓ మహిళ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 8 పెళ్లిళ్లు చేసుకుంది. వారందరి వద్ద అందినకాడికి దోచుకుంది. 9వ సారి మళ్లీ పెళ్లి పీటలు ఎక్కబోయి పోలీసులకు అడ్డంగా బుక్కయింది. మహారాష్ట్రలోసంచలనం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.  నాగ్‌పూర్‌కు చెందిన సమీరా ఫాతిమా ఉన్నత విద్యావంతురాలు. అందంగా ఉంటుంది. టీచర్‌గా ఉద్యోగం చేస్తోంది. కానీ, ఆమెకు ఒక పాడు బుద్ది ఉంది. అదెంటంటే డబ్బుల కోసం వక్రమార్గాలను ఎంచుకుంది. ఈ పాడు బుద్ధి ఎలా పుట్టిందో ఏమో తెలీదు కానీ.. డబ్బుల కోసం ఏకంగా 8 మందిని పెళ్లి చేసుకుని వారిని మోసం చేసింది.

ఇది కూడా చూడండి:ధర్మస్థలలో కీలక పరిణామం.. బయటపడిన అవశేషాలు

సమీరా ఫాతిమా స్థానికంగా ఓ గ్యాంగ్‌తో జతకట్టింది. వారి సాయంతో డబ్బున్న వివాహిత ముస్లింలను పెళ్లి చేసుకుని మోసం చేయటం మొదలు పెట్టింది. గడచిన 15 ఏళ్లనుంచి ఇవే మోసాలకు పాల్పడుతోంది. ఇప్పటి వరకు 8 మంది మగాళ్లను పెళ్లి చేసుకుని మోసం చేసింది. పక్కా ప్లాన్‌తో వారిని పెళ్లి చేసుకోవడం వారి నుంచి లక్షల రూపాయలు దోచేసి వదిలేయడం ఇదే ఆమె పని. దీనికోసం మొదట మాట్రిమోనియల్ వెబ్‌సైట్లు, ఫేస్‌బుక్ నుంచి మగాళ్లను సెలెక్ట్ చేసుకుంటుంది. ఫేస్‌బుక్ లేదా వాట్సాప్ కాల్స్ ద్వారా వారితో పరిచయం పెంచుకుంటుంది. తనకు భర్తతో విడాకులు అయ్యాయని, ఓ పిల్లాడు ఉన్నాడని వారికి తన ఎమోషనల్ స్టోరీ చెప్పి వారికి దగ్గరయ్యేది. 

ఇది కూడా చూడండి: ధర్మస్థల శవాల వెనుక అంతుచిక్కని మిస్టరీలు.. వెలుగులోకి సంచలన విషయాలు!


వారు అది నిజమేనని నమ్మి ఆమెను పెళ్లి చేసుకునేవారు. పెళ్లి తర్వాత వారిని బ్లాక్ మెయిల్ చేసి.. పెద్ద మొత్తంలో తన ఖాతాలకు డబ్బులు పంపించుకునేది. తర్వాత అతన్ని వదిలేసి అక్కడినుంచి పరారయ్యేది. అలా సమీరా ఓ భర్తనుంచి ఏకంగా రూ.50 లక్షలు.. మరో భర్త నుంచి 15 లక్షల రూపాయలు దోచుకుంది. ప్రధానంగా ఇక్కడ చెప్పుకోవలసిన  ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. రిజర్వ్ బ్యాంకులో పనిచేసే సీనియర్ అధికారులను కూడా ఆమె నమ్మించి పెళ్లి చేసుకుని మోసం చేసింది. వారి నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు దోచుకుంది. అలా 8 మంది ఆమె చేతిలో చిక్కి మోస పోయారు.9వ సారి మరో వ్యక్తిని ఎంపిక చేసుకుంది. ఈ క్రమంలోనే  ఆమె చేతిలో మోసపోయిన కొంతమంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జులై 29న 9వ వ్యక్తిని కలుసుకునేందుకు ఓ టీషాపులో వేయిట్ చేస్తున్న సమయంలో ఉన్న సమీరాను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది. ప్రస్తుతం కటకటాల్లో ఊసలు లెక్కిస్తూ కూర్చుంది.  

Also Read: 10 నిమిషాల్లో లక్షల కోట్ల నష్టం.. ట్రంప్‌ టారిఫ్‌‌తో కుప్పకూలిన స్టాక్ మార్కెట్!

Advertisment
తాజా కథనాలు