Lashkar Bonalu: ధూమ్ధామ్గా ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు
సికింద్రాబాద్ లష్కర్ బోనాల పండుగ కోలాహలంగా ప్రారంభమైంది. మంత్రి పొన్నం ప్రభాకర్ అమ్మవారికి పట్టు వస్త్రాలు, తొలి బోనం సమర్పించారు. ఉదయం 8 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమ్మవారిని దర్శించుకోనున్నారు. తెల్లవారుజామునుంచే ఆలయం వద్ద భక్తుల సందడి మొదలైంది.