Lashkar Bonalu: సికింద్రాబాద్ ఉజ్జయినీ అమ్మవారి బోనాలు ధూమ్‌ధామ్‌గా ప్రారంభం అయ్యాయి. తెల్లవారుజామున మూడు గంటలకు మంత్రి పొన్నం ప్రభాకర్ అమ్మవారికి పట్టువస్త్రాలు, తొలి బోనం సమర్పించారు. ఈ ఉదయం 8 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహంకాళి అమ్మవారిని దర్శించుకోనున్నారు.
పూర్తిగా చదవండి..భారీ ఏర్పాట్లు..
Lashkar Bonalu: లష్కర్ బోనాలకు ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. అమ్మవారి ఆలయాన్నిసర్వాంగ సుందరంగా అలంకరించారు. ఇక ఆలయ పరిసరాలు ప్రత్యేకంగా విద్యుద్దీపాలతో మెరిసిపోతున్నాయి. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను చాటిచెప్పేవిధంగా ఉజ్జయిని మహంకాళి బోనాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉదయం వేద మంత్రోచ్ఛారణలతో ఆలయ ద్వారాన్ని తెరిచారు. ప్రత్యేక పూజల అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ తొలి బోనం సమర్పించారు. ఆ తరువాత బోనాలు సమర్పించేందుకు భక్తులను అనుమతించారు. నగరం నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకోవడానికి బారులు తీరారు. ఇక ఈ ఉదయం 8 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమ్మవారిని దర్శించుకోవడానికి రానున్నారు. ఈ సందర్భంగా ఆలయం దగ్గర గట్టి భద్రతా చర్యలు చేపట్టారు.
పటిష్ట చర్యలు..
Lashkar Bonalu: భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వీఐపీలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉండడంతో దానికి అవసరమైన ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అన్ని శాఖల సమన్వయంతో బోనాల నైవేద్యం నుంచి ఫలహారాల బండి ఊరేగింపు వరకు.. అలాగే రేపు నిర్వహించే రంగం కార్యక్రమం వరకూ ప్రశాంతంగా జరిగేలా అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. అమ్మవారి దర్శనానికి హైదరాబాద్ నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా భక్తులు పోటెత్తుతారు.
భారీ బందోబస్తు..
Lashkar Bonalu: బోనాల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం దాదాపు 1500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. అమ్మవారి ఆలయ ప్రాంగణంలో వివిధ శాఖల అధికారులతో ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. మరోవైపు బోనాల సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ 175 ప్రత్యేక బస్సులను నడుపుతోంది. లష్కర్ బోనాల సందర్భంగా ఆదివారం, సోమవారం రెండు రోజులూ అమ్మవారి ఆలయ పరిసరాల్లోని అన్ని ప్రధాన రహదారులపై పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అమ్మవారిని దర్శించుకునే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రెండు రోజుల పాటు వివిధ మార్గాల్లో ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నట్లు హైదరాబాద్ నగర కమిషనర్ శ్రీనివాస రెడ్డి తెలిపారు. జాతర ముగిసే వరకు ఆంక్షలు కొనసాగుతాయని కమిషనర్ తెలిపారు.
Also Read: ఉజ్జయిని మహంకాళికి పొన్నం పూజలు
Lashkar Bonalu: సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ప్రయాణాలు చేయాలి అనుకునే వారు ఈ రెండు రోజులు తమ స్టేషన్ కు చేరుకోవడానికి చాలా ముందుగానే ఇంటి నుంచి బయలు దేరడం మంచిది అని పోలీసులు సూచిస్తున్నారు. లష్కర్ బోనాల సందర్భంగా స్టేషన్ పరిసరాల్లో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అందుకే ముందు జాగ్రత్త తీసుకోవాలని ప్రయాణీకులను అధికారులు కోరుతున్నారు.