BIG BREAKING: తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు 2 రోజులు సెలవులు!

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర సందర్భంగా జూలై 20, 21 తేదీల్లో ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు సెలవులు రానున్నాయి. అలాగే రెండు రోజుల పాటు వైన్ షాపులు, బార్లను మూసివేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

New Update
2025 SCHOOL HOLIDAYS

Telangana Bonalu 2025 SCHOOL HOLIDAYS

హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరకు రంగం సిద్ధమైంది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. పలు జిల్లాల్లో ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు, కాలేజీలకు సోమవారం (జూలై21) అధికారిక సెలవుదినంగా ప్రకటించింది. దీంతో జూలై 20 ఆదివారం, జూలై 21 సోమవారం రెండు రోజుల పాటు సెలవులు రానున్నాయి.  

అలాగే ఈ రెండు రోజుల పాటు వైన్ షాపులు, బార్లను మూసివేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జూలై 20న ఉదయం 6 గంటల నుంచి జూలై 22 ఉదయం 6 గంటల వరకు మద్యం విక్రయాలు మూతపడనున్నాయి. అయితే ఇక్కడ గుర్తుంచుకోవలసిన విషయం ఏంటంటే.. ఈ వైన్స్ బంద్ కేవలం హైదరాబాద్ నగరంలో మాత్రమే. రాష్ట్రం మొత్తం కాదు. 

Also Read: ఓ వైపు రష్యాతో యుద్ధం..మరోవైపు ఉక్రెయిన్‌ రాజకీయాల్లో పెను మార్పులు

Telangana Bonalu 2025

Also Read : నీళ్లకు బయపడుతున్న రష్యా సైనికులు.. ఉక్రెయిన్ ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు

బోనాల జాతరకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉన్నందున, శాంతిభద్రతలను పర్యవేక్షించేందుకు, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. లక్షలాది మంది ప్రజలు దశాబ్ధాలుగా జరుపుకుంటున్న పండుగ కావడంతో జూలై 21న ప్రత్యేక సెలవుగా ప్రభుత్వం ప్రకటించింది. 

తెలంగాణలో బోనాలు రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందింది. ముఖ్యంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు తరలివస్తారు. ఈ నేపథ్యంలో, భక్తుల భద్రత, జాతర వాతావరణానికి భంగం కలగకుండా చూసేందుకు ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. ఈ ఉత్తర్వులు సంబంధిత ఎక్సైజ్ శాఖ ద్వారా అన్ని వైన్ షాపులు, బార్లకు పంపారు. ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు