/rtv/media/media_files/2025/07/13/mahakali-bonalu-2025-07-13-18-59-53.jpg)
Mahakali Bonalu
Ujjaini Mahankali Bonalu : సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి బోనాల (లష్కర్) జాతర ఘనంగా ప్రారంభమైంది. అమ్మవారికి తెల్లవారుజామునే మహా మంగళ హారతి ఇచ్చారు. అమ్మవారిని మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు దర్శించుకున్నారు. ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, తొలి బోనం సమర్పించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. అమ్మవారి ఆలయాన్ని అధికారులు సుందరంగా తీర్చిదిద్దారు. అమ్మవారి కీర్తనలతో గుడి పరిసరాలు హోరెత్తుతున్నాయి. ఉజ్జయినికి బోనాలు సమర్పించడానికి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. దీంతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తుల సౌకర్యార్థం ఆరు క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ఉజ్జయిని మహాకాళిని దర్శించుకోవడానికి జంటనగరాలతో పాటు చుట్టూపక్కల జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు.
Also read: 17 రోజుల్లో 30 పుణ్యక్షేత్రాలు.. అదిరిపోయే ఐఆర్‌సీటీసీ ప్యాకేజ్
బోనాలు సమర్పించడానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వారి కోసం రెండు క్యూలైన్లు ఏర్పాటు చేశారు. శివసత్తులకు ప్రత్యేకంగా మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు ఆర్పీరోడ్, బాట షో రూం నుంచి ప్రవేశం కల్పించారు. దేవాలయానికి వివిధ మార్గాల్లో వచ్చే భక్తులు వాహనాలను పార్కింగ్ చేయడానికి ప్రత్యేక ఏర్పాటు చేశారు. బోనాల జాతర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు పటిష్ట ఏర్పాట్లు చేశారు. పోలీసులు పటిష్టమైన బందోబస్తు నిర్వహిస్తున్నారు.
Also Read: భారత్ అరుదైన ఘనత.. WHO నివేదికలో ప్రత్యేక గుర్తింపు
లష్కర్ బోనాల సందర్భంగా 2500 మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. లా అండ్ ఆర్డర్, షీ టీమ్స్, టాస్క్‌ఫోర్స్ పోలీసులు బందోబస్తులో పాల్గొన్నాంటున్నారు. ప్రత్యేకంగా ఆలయ పరిసరాల్లో 200 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. సీఎంతో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయానికి మంత్రులతోపాటు పలువురు వీఐపీలు కూడా బారులు తీరారు.
ఇది కూడా చూడండి:Kota Srinivasa Rao: ఆ సూపర్ హిట్ పాట పాడింది 'కోట' నే.. ఈ విషయం మీకు తెలుసా?