CBI: సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసు క్లోజ్
ధోనీ యాక్టర్ దివంగత హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసును సీబీఐ క్లోజ్ చేసింది. దీనికి సంబంధించి క్లోజ్ రిపోర్ట్ ను కోర్టులో దాఖలు చేసింది. సుశాంత్ మృతిలో ఎటువంటి కుట్రకోణం లేదని అందులో తెలిపింది.
ధోనీ యాక్టర్ దివంగత హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసును సీబీఐ క్లోజ్ చేసింది. దీనికి సంబంధించి క్లోజ్ రిపోర్ట్ ను కోర్టులో దాఖలు చేసింది. సుశాంత్ మృతిలో ఎటువంటి కుట్రకోణం లేదని అందులో తెలిపింది.
ప్రముఖ నటుడు రాకేష్ పాండే కన్నుమూశారు. ఆయనకు ప్రస్తుతం 77 సంవత్సరాలు. ముంబైలోని ఆరోగ్య నిధి ఆసుపత్రిలో గుండెపోటుతో చనిపోయారు. రాకేష్ పాండే తన కెరీర్లో ఎన్నో గొప్ప ప్రదర్శనలు ఇచ్చారు. ఆయన అంత్యక్రియలు శాస్త్రి నగర్ శ్మశానవాటికలో జరిగాయి.
భారత మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ తెరపై కనిపించనున్నారనే వార్తలపై క్లారిటీ వచ్చింది. ‘ఖాకీ:ది బెంగాల్ చాప్టర్’ (ఖాకీ 2) సిరీస్‌లో అతడు కేవలం ప్రమోషన్స్‌లో మాత్రమే భాగం అయినట్లు తెలుస్తోంది. తాజాగా నెట్‌ఫ్లిక్స్ ఓ వీడియో రిలీజ్ చేయగా ఈ విషయం అర్థమైంది.
ప్రముఖ దర్శకుడు అయాన్ ముఖర్జీ తండ్రి, నటుడు దేబ్ ముఖర్జీ కన్నుమూశారు. 83 ఏళ్ల వయసున్న దేబ్ ముఖర్జీ కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆయన ముంబైలోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ 60వ పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. చిట్ చాట్ చేస్తూ ప్రస్తుతం ఆయన ఫ్రెండ్ గౌరీ స్ప్రాట్‌తో డేటింగ్లో ఉన్నట్లు చెప్పారు. ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ మహా భాతర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
హోలీకి సంబంధించిన కొన్ని ఎవర్గ్రీన్ పాటలు మీ కోసం ఇక్కడ ఉన్నాయి. హొలీ రోజున ఈ పాటలను పెట్టుకొని మీ పండగను ఫుల్ ఎంజాయ్ చేయండి. పాటల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
భారతీయ సినీ పరిశ్రమ ప్రతిష్టాత్మకంగా భావించే IIFA 2025 అవార్డుల వేడుక కనుల పండుగగా మొదలైంది. జైపుర్ వేదికగా 2 రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుండగా మొదటిరోజు బాలీవుడ్ తారలు, రాజకీయ నేతలు, ప్రముఖులు పాల్గొని సందడి చేశారు.
ఛావా మూవీ చూసి కొంతమంది నిధుల వేటకు వెళ్లారు. అసీర్‌గఢ్ కోటలో నిధులు ఉన్నాయనే నమ్మకంతో రాత్రి సమయంలో కూడా మెటల్ డిటెక్టర్లు, టార్చిలైట్లు వేసుకుని మరీ వెతుకుతున్నారు. దీంతో విషయం తెలుసుకుున్న అధికారులు మరోసారి తవ్వితే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.
ఓ ఇంటర్వ్యూలో కుబ్రా సైత్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలను వెల్లడించింది. గతంలో తాను అండమాన్ ట్రిప్‌కు వెళ్లినప్పుడు అక్కడ ఓ ఫ్రెండ్‌తో కలవడం వల్ల గర్భం దాల్చినట్లుగా వెల్లడించింది. భయపడి ఒంటరిగా వెళ్లి అబార్షన్ చేయించుకున్నానంది.