Shalini Pandey: అలియాతో నాకు పోలికేంటి.. అర్జున్‌రెడ్డి బ్యూటీ సంచలనం!

నటి షాలిని ప్రేక్షకులు తనను అలియా భట్ తో పోల్చడంపై స్పందించింది. తనను ఒకరితో పోల్చి చూడడం నచ్చదని.. తనను తనలా గుర్తిస్తే చాలని పేర్కొంది. కానీ వారు ప్రేమతో పోలుస్తున్నారు కావున పర్వాలేదని తెలిపింది.

New Update

Shalini Pandey:  విజయ్ దేవరకొండ 'అర్జున్ రెడ్డి'  సినిమాలో ప్రీతీ పాత్రతో సంచలనం సృష్టించింది నటి షాలిని. ఈ ఒక్క సినిమా సినిమా యూత్ లో షాలిని క్రేజ్ అమాంతం పెంచేసింది. దీని తరవాత పలు సినిమాలు చేసినప్పటికీ.. పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. ప్రస్తుతం షాలిని హిందీ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఇటీవలే హిందీలో మహారాజ్ సినిమాలో 'కిషోరీ' పాత్రతో ఆకట్టుకుంది. ఈ క్రమంలో కొంతమంది అభిమానులు ఆమెను నటి ఆలియా భట్ తో పోల్చడం మొదలు పెట్టారు.  షాలిని.. ఆలియా భట్‌ ముఖ పోలికలు,స్టైల్  కలిగి ఉందంటూ తమ ప్రేమను తెలియజేస్తున్నారు. 

Also Read: ప్రధాని నుంచి సినీ తారల వరకు అంతా షాకయ్యారు! అసలు 'Adolescence' సీరీస్ లో ఏముంది?

Shalini panday
Shalini panday

 

అలా పోల్చడం నచ్చదు.. 

 అయితే తాజాగా అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో కూడా షాలినీని దీని గురించి ప్రశ్నించగా .. ఆమె చెప్పిన సమాధానం నెట్టింట వైరల్ గా మారింది. తనను ఒకరితో పోల్చడం నచ్చదు.. కానీ వారు ప్రేమతో పోలుస్తున్నారు కావున పర్వాలేదని తెలిపింది. తనను తనలా గుర్తిస్తే చాలని పేర్కొంది.

షాలిని మాట్లాడుతూ.. "ప్రేక్షకులు నన్ను ఎంతో అభిమానిస్తున్నారు. వారి ప్రేమాభిమానాలు వెలకట్టలేనివి. కానీ కొంతమంది నన్ను హీరోయిన్ ఆలియా భట్ తో పోలుస్తూ తమ ప్రేమను తెలియజేస్తున్నారు. ఆల్రెడీ ఇండస్ట్రీలో ఒక ఆలియా ఉన్నారు. కావున ఆమెలా మరొకరు అవసరం లేదు. ఆమె అద్భుతమైన నటి. నేను కూడా ఆమె నుంచి ఎంతో స్ఫూర్తి పొందాను, ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. కానీ నాకు నా స్వంత వ్యక్తిత్వం ఉండాలని కోరుకుంటున్నాను. ఒకరితో పోల్చడం కంటే ప్రజలు నన్ను నన్ను నన్నుగా గుర్తించాలనేదే  నా ఉద్దేశం అని తెలిపింది"

latest-news | cinema-news | bollywood | shalini-pande | alia-bhatt

Also Read: Payal Rajput: నన్ను తొక్కేసారు.. ఇండస్ట్రీలో అవకాశాలు రావాలంటే?- పాయల్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు