/rtv/media/media_files/2025/04/09/MsFB6nGGMewyLctm3lEb.jpg)
thamanna producer
బాలీవుడ్ లో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నిర్మాత సలీమ్ అక్తర్ కన్నుమూశారు. 87 ఏళ్ల అక్తర్ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. స్టార్ హీరోయిన్లుగా వెలుగు చూసిన రాణీ ముఖర్జీ,తమన్నాలను ఇండస్ట్రీకి పరిచయం చేసింది ఈయనే.
Veteran film producer Salim Akhtar passed away today (8th April) at Kokilaben Dhirubhai Ambani Hospital in Mumbai. He launched actress Rani Mukerji in his film Raja Ki Aayegi Barat! RIP! pic.twitter.com/LFX7g1QOFt
— KRK (@kamaalrkhan) April 8, 2025
చాంద్ సా రోషన్ చెహ్రా చిత్రంతో
1980, 1990లలో అమిర్ ఖాన్, బాబీ డియోల్, మిథున్ చక్రవర్తిలతో ఆయన వరుసగా సినిమాలు చేసేవారు. 'చోరోన్ కి బారాత్', 'ఖయామత్', 'లోహా', 'పార్టీషన్', 'ఫూల్ ఔర్ అంగారే', 'బాజీ', 'ఇజ్జత్' మరియు 'బాదల్' వంటి చిత్రాలకు సలీం గుర్తింపు తెచ్చుకున్నారు. రాణి ముఖర్జీ 1997లో నిర్మాత సలీం చిత్రం రాజా కీ ఆయేగీ బారాత్‌తో రంగప్రవేశం చేయగా, తమన్నా భాటియా 2005లో చాంద్ సా రోషన్ చెహ్రా చిత్రంతో బాలీవుడ్ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది.
సలీం అక్తర్ షామా అక్తర్‌ను వివాహం చేసుకున్నాడు. ఏప్రిల్ 09 బుధవారం జోహార్ ప్రార్థనల తర్వాత మధ్యాహ్నం 1.30 గంటలకు ఇర్లా మసీదు సమీపంలోని శ్మశానవాటికలో ఆయన అంత్యక్రియలు జరుగుతాయి.
Also Read : Tamilisai Soundararajan : తెలంగాణ మాజీ గవర్నర్ ఇంట విషాదం!
Also Read: TG Crime: ఖమ్మంలో అమానుషం.. మంత్రాల నెపంతో సొంత బాబాయినే హత్య చేసిన యువకుడు!