/rtv/media/media_files/2025/04/09/1cHoRMaCsa0pzRLCnBrI.jpg)
ali-venkatesh
హీరో వెంకటేష్ అంటే టక్కున గుర్తొచ్చేది రీమేక్.. వెంకీ కెరీర్ మొత్తం చూసుకుంటే డైరెక్ట్ కంటే రీమేకులే ఎక్కువగా ఉంటాయి. ఆ రీమేక్ లలోనే వెంకీకి చాలా హిట్స్ ఉన్నాయి. అయితే వేరే బాషల్లోని సినిమాలను తెలుగులో రీమేక్ చేసే వెంకటేష్.. ఓ తెలుగు సినిమాను హిందీలో రీమేక్ చేశాడని చాలామందికి తెలియదు. అది కూడా కమేడియన్ ఆలీ సినిమా.
Also read : Uttar Pradesh : ఐదుగురు పిల్లల తల్లి, నలుగురు పిల్లల తండ్రితో జంప్!
వెంకటేష్ తక్దీర్వాలా పేరుతో
ఆలీ హీరోగా ఎస్వీ కృష్ణ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా యమలీల. ఇందులో ఆలీ, ఇంద్రజ, మంజు భార్గవి ప్రధాన పాత్రల్లో నటించారు. కైకల సత్యనారయణ యుముడి పాత్రలో నటించారు. రూ. 75 లక్షల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రెట్టింపు వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రంతో హీరోగా అరంగేట్రం చేసిన ఆలీ రూ.50,000 పారితోషికం అందుకున్నాడు. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో హీరోగా ఏకంగా 50 సినిమాలు చేశాడు ఆలీ.
అయితే తెలుగులో ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో హీరో వెంకటేష్ తక్దీర్వాలా పేరుతో హిందీలో రీమేక్ చేశారు. ఈ చిత్రానికి కె. మురళీ మోహన రావు దర్శకత్వం వహించగా.. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రామా నాయుడు నిర్మించారు. ఇందులో వెంకటేష్ సరసన రవీనా టాండన్ హీరోయిన్ గా నటించింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విఫలమైనప్పటికీ టెలివిజన్‌లో ప్రసారం అయిన తర్వాత కల్ట్ హిట్‌గా నిలిచింది. రూ. 2.75 కోట్లుతో ఈ సినిమాను నిర్మించారు.
Also Read : Tamilisai Soundararajan : తెలంగాణ మాజీ గవర్నర్ ఇంట విషాదం!
Also Read: TG Crime: ఖమ్మంలో అమానుషం.. మంత్రాల నెపంతో సొంత బాబాయినే హత్య చేసిన యువకుడు!
venkatesh | bollywood | Taqdeerwala | Yamaleela | comedian Ali | latest tollywood updates | latest-telugu-news | telugu-news | today-news-in-telugu