Ananya Nagalla: బాలీవుడ్‌లోకి పవన్ కళ్యాణ్ హీరోయిన్ ఎంట్రీ

వకీల్‌సాబ్‌తో ఫేమ్ సంపాదించుకున్న తెలుగమ్మాయి అనన్య నాగళ్ల బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఏకంగా లేడీ ఓరియెంటెడ్‌ సినిమాతోనే ఎంట్రీ ఇస్తోంది. అయితే ఈ చిత్రానికి రాకేష్‌ జగ్గి దర్శకత్వం వహిస్తుండగా, ఇమ్మత్‌ లడుమోర్‌ నిర్మిస్తున్నారు.

New Update
Ananya Nagalla

Ananya Nagalla

తెలుగు అమ్మాయి అనన్య నాగళ్ల ఇండస్ట్రీలో రాణిస్తోంది. వరుస సినిమాలో అదరగొడుతుంది. మంచి కంటెంట్ ఉన్న సినిమాలను ఎంపిక చేసుకుంటూ.. నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. అయితే ఈ వకీల్‌సాబ్ హీరోయిన్ ఇప్పుడు బాలీవుడ్‌‌లోకి ఎంట్రీ ఇస్తోందని టాక్.  ఏకంగా లేడీ ఓరియెంటెడ్‌ చిత్రంతో ఆమె బాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వడం విశేషం. ఈ చిత్రానికి రాకేష్‌ జగ్గి దర్శకత్వం వహిస్తుండగా, ఇమ్మత్‌ లడుమోర్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అనన్య ఓ ట్రైబల్ అమ్మాయిగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. 

ఇది కూడా చూడండి: GT VS SRH: హైదరాబాద్ ఇక ఇంటికి వెళ్ళిపోయినట్లే...వరుసగా నాలుగో ఓటమి

ఇది కూడా చూడండి: Agniveers: అగ్నివీరులకు గుడ్‌న్యూస్‌.. పోలీస్ నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్లు

సాఫ్ట్‌వేర్ జాబ్ వదిలి మరి..

అనన్య నాగళ్ల సాఫ్ట్‌వేర్‌ జాబ్‌ వదులుకుని షాదీ అనే షార్ట్ ఫిల్మ్‌తో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మల్లేశం సినిమాతో వెండితెరపై కనిపించింది. ఇలా ఆమెకు పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ నటించిన వకీల్‌ సాబ్‌లో ఛాన్స్ వచ్చింది. ఈ సినిమాలో అనన్య నటనకు మంచి మార్క్‌లు పడ్డాయి. అప్పటి నుంచి కంటెంట్ ఉన్న సినిమాలు ఎంచుకుంటూ టాలీవుడ్‌లో రాణిస్తోంది. 

ఇది కూడా చూడండి: 57ఏళ్ల వయసులో ఇదేం బుద్ధి.. లవర్ తండ్రి అస్థికలతో బ్లాక్‌మెయిల్ ‘వస్తేనే ఇస్తా’

ఇదిలా ఉండగా అనన్య నాగళ్ల సోషల్ మీడియాలో కూాడా యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడూ ఫొటోలు షేర్ చేస్తుంటుంది. ఇటీవల రామనవమి సందర్భంగా కూడా ఫొటోలు షేర్ చేసింది. ఈ ఫొటోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

ఇది కూడా చూడండి: Jibli Trend: జిబ్లీలో ఫోటోలు అప్ లోడ్ చేస్తున్నారా..అయితే జాగ్రత్త

 

heroine-ananya-nagalla | actress-ananya-nagalla | Ananya Nagalla | tollywood-actress | latest-telugu-news | today-news-in-telugu | breaking news in telugu | telugu-cinema-news | telugu-film-news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు