/rtv/media/media_files/2025/04/04/itbrknKfbdotq47oVIuB.jpg)
bollywood Actor and director Manoj Kumar Passes Away and her Cinematic career
బాలీవుడ్ నటుడు, దర్శకుడు మనోజ్ కుమార్ (87) తుదిశ్వాస విడిచారు. అనారోగ్యం, వయోభారంతో ముంబైలోని ధీరుభాయ్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.
Also Read: ఏపీ ప్రజలకు ఐఎండీ హెచ్చరికలు.. ఈ జిల్లాల్లో వర్షాలు, పిడుగులు ...!
సినీ ప్రస్థానం
ఇదిలా ఉంటే ఇక సినీ ప్రస్థానం విషయానికొస్తే.. యాక్టర్ & డైరెక్టర్ మనోజ్ కుమార్ అసలు పేరు హరికృష్ణ గిరి గోస్వామి. 1937 జులై 24న ఆయన బ్రిటిష్ ఇండియాలోని అబాటాబాద్‌లో (ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉంది) జన్మించారు. 1947 దేశ విభజన సమయంలో ఆయన ఫ్యామిలీ భారతదేశానికి వలస వచ్చింది.
Also Read: మనుషులులేని దీవులపై కూడా ట్రంప్ టారిఫ్ ఛార్జీల మోత.. ఎందుకంటే?
అనంతరం 1957లో ‘ఫ్యాషన్’ అనే సినిమాతో మనోజ్ కుమార్ సినీ ప్రస్థానం మొదలైంది. ఆ తర్వాత 1962లో ‘హరియాలీ ఔర్ రాస్తా’, 1965లో ‘షహీద్’ వంటి సినిమాలతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అనంతరం 1967లో ‘ఉప్కార్’ సినిమా విడుదలై మనోజ్ కుమార్‌కు మరింత పేరు సంపాదించి పెట్టింది. ఈ సినిమాతో ఆయనకు ‘భారత్ కుమార్’ అనే బిరుదు వచ్చింది.
Also Read: నటిపై గృహ హింస కేసు.. హైకోర్టును ఆశ్రయించిన హన్సిక!
దేశభక్తి సినిమాలు
దీని తర్వాత మనోజ్ కుమార్ ఎక్కువగా దేశభక్తి సినిమాలను తెరకెక్కించారు. అలా 1970లో ‘పూరబ్ ఔర్ పశ్చిమ్’, 1974లో ‘రోటీ కపడా ఔర్ మకాన్’, 1981లో ‘క్రాంతి’తో సహా మరెన్నో సినిమాలతో మనోజ్ దేశ సామాజిక సమస్యలను, జాతీయ భావాలను తట్టి లేపారు. రచయితగా, దర్శకుడిగా, నటుడిగా మనోజ్ కుమార్ తన సత్తాను చాటారు.
Also Read: టర్కీలో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. 200మంది భారతీయులు 16 గంటలుగా
దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు..
మనోజ్ కుమార్ సేవలను గుర్తించి భారత ప్రభుత్వం 1992లో ఆయనకు పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. అనంతరం 2016లో మనోజ్ కుమార్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వరించింది.
(Actor Manoj Kumar Passes Away | latest-telugu-news | bollywood)