/rtv/media/media_files/2025/04/06/J53RsAKGMfh6nRJ3am6E.jpg)
Mugdha Chapekar and Ravish Desai divorce
Ravish Desai: సినీ ఇండస్ట్రీలో మరో సెలెబ్రెటీ జంట 9 ఏళ్ల వివాహ బంధానికి ముగింపు పలికారు. బుల్లితెర పై అత్యంత ప్రజాదరణ పొందిన ముగ్ధా చాపేకర్, రవీష్ దేశాయ్ జంట విడిపోతున్నట్లు ప్రకటించి అందరినీ షాక్ కి గురిచేశారు. ఈ విషయాన్ని నటుడు రవీష్ సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ పోస్ట్ పెట్టారు. చాలా ఆలోచించిన తర్వాత నేను, ముగ్ధా భార్యాభర్తలుగా విడిపోవాలని నిర్ణయించుకున్నాము. గత ఏడాది నుంచి దీనిపై చర్చలు జరుగుతుండగా.. ఇప్పుడు దీనిపై నిర్ణయం తీసుకున్నాము. ప్రియమైన అభిమానులు, శ్రేయోభిలాషులు, మీడియా దయతో మాకు అవసరమైన గోప్యతను అందించాలని అభ్యర్థిస్తున్నాము. దయచేసి ఎలాంటి తప్పుడు కథనాలు, ప్రకటనలు నమ్మవద్దు. మీ ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు అని పోస్ట్ పెట్టారు రవీష్.
2016లో వివాహం
అయితే దీనిపై భార్య ముగ్ధ నుంచి ఇంకా ఎటువంటి ప్రకటన రాలేదు. 'సత్రంగి ససురాల్' సీరీయల్ నుంచి ఏర్పడిన రవీష్ దేశాయ్, ముగ్ధా చాఫేకర్ పరిచయం ప్రేమగా మారింది. రెండేళ్ల పాటు డేటింగ్ చేసిన తర్వాత వీరిద్దరూ 2016లో వివాహం చేసుకున్నారు.
telugu-news | cinema-news | bollywood | Ravish Desai -Mugdha Chaphekar