Boat Accident: సముద్రంలో ఘోర ప్రమాదం.. బోటు బోల్తా పడి ముగ్గురు భారతీయులు మృతి
ఆఫ్రికాలోని మొజాంబిక్ బెయిరా ఓడరేవు సమీపంలో బోటు ప్రమాదం చోటుచేసుకుంది.ఈ విషాద ఘటనలో ముగ్గురు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు నీటిలో గల్లంతయ్యారు.
ఆఫ్రికాలోని మొజాంబిక్ బెయిరా ఓడరేవు సమీపంలో బోటు ప్రమాదం చోటుచేసుకుంది.ఈ విషాద ఘటనలో ముగ్గురు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు నీటిలో గల్లంతయ్యారు.
నైజీరియాలోని వాయువ్య సోకోటో రాష్ట్రంలోని స్థానిక గోరోన్యో మార్కెట్కు వెళ్తుండగా పడవ ప్రమాదానికి గురైంది. దీంతో 40 మంది నదిలో పడి గల్లంతు అయ్యారు. ఇందులో 10 మందిని ప్రాణాలతో రక్షించినట్లు జాతీయ అత్యవసర నిర్వహణ సంస్థ తెలిపింది.
ఆఫ్రికా నుంచి ఉపాది కోసం గల్ఫ్ దేశాలకు వస్తున్న శరణార్థులు, వలసదారులతో ప్రయాణిస్తున్న పడవ యెమెన్ తీరంలో మునిగిపోయింది. ఈ ఘోర విషాద ఘటనలో 68 మంది మరణించగా, మరో 74 మంది గల్లంతయ్యారని ఐక్యరాజ్యసమితి వలస సంస్థ (IOM) వెల్లడించింది.
వియాత్నంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. హలోంగ్ బేలోని తుఫాను ప్రభావంతో ఓ బోటు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 28 మంది మృతి చెందారు. రంగంలోకి దిగిన బోర్డర్ గార్డ్స్ 12 మంది టూరిస్టులను రక్షించారు. మిగతావారు గల్లంతయ్యారు.
వికారాబాద్ జిల్లాలో శనివారం విషాదం చోటుచేసుకుంది. సర్పన్పల్లి ప్రాజెక్టులో పర్యాటకుల బోటు బోల్తా పడింది. ప్రమాద సమయంలో బోటులో ఐదుగురు పర్యటకులు ఉన్నారు. వారిలో ఇద్దరు మహిళలు మృతి చెందారు. మరో ముగ్గురిని స్థానికులు రక్షించారు.
మధ్య ఆఫ్రికా దేశం కాంగోలోని మబండక సమీపంలోని నదిలో ప్రయాణికులు పడవ మునిగిపోయింది. ఈ ప్రమాద ఘటనలో 50 మందికి పైగా మృతి చెందారు. మొత్తం 400 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఈ పడవలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో మునిగిపోయింది.
కాంగోలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సుమారు 25 మంది మృతి చెందగా...వారిలో ఫుట్ బాల్ ఆటగాళ్లు కూడా ఉన్నట్లు అధికారులు వివరించారు. మరో 30 మందిని ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా రక్షించినట్లు తెలిపారు
యెమెన్, జిబౌటి తీర ప్రాంతాల మధ్య విషాదం చోటుచేసుకుంది. వలసదారులతో వెళ్తున్న నాలుగు పడవలు నడిసముద్రంలో మునిగిపోయాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో 186 మంది గల్లంతయ్యారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
పశ్చిమ ఆఫ్రికా మౌరిటానియా నుంచి 86 మంది వలసదారులతో స్పెయిన్ బయలుదేరిన పడవ మొరాకో సమీపంలో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 50 మంది నీటిలో గల్లంతు కాగా, 36 మందిని కాపాడినట్లు తెలిపారు. మృతి చెందిన వారిలో 40 మందికి పైగా పాక్ పౌరులు ఉన్నట్లుగా సమాచారం.