/rtv/media/media_files/2026/01/26/philippines-ferry-accident-2026-01-26-16-21-06.jpg)
Philippines Ferry Accident
Philippines Ferry Accident : దక్షిణ ఫిలిప్పీన్స్‌లో ఘోర ప్రమాదం జరిగింది. జాంబోంగా నుండి సులు ప్రావిన్స్‌కు 359 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఫెర్రీ షిప్ సోమవారం తెల్లవారుజామున సముద్రంలో మునిగిపోయింది. 300 మందికి పైగా ప్రయాణికులు, సిబ్బందితో వెళ్తున్న ఈ ఫెర్రీ బోట్ బలుక్‌బలుక్ ద్వీపం సమీపంలో సముద్రంలో మునిగిపోయింది. ఈ ప్రమాదం(Boat Accident) లో 15 మంది మృతి చెందగా, 28 మంది గల్లంతయ్యారు. భద్రతా సిబ్బంది 316 మందిని రక్షించారు. ప్రస్తుతం గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్(Rescue team) సహాయకచర్యలు ప్రారంభించింది. ఇప్పటి వరకు 250 మందిని రక్షించినట్లు ఫిలిప్పీన్స్ కోస్ట్ గార్డ్ సోమవారం తెలిపింది.
Also Read : గాజా శవాల దిబ్బ మీద ట్రంప్‌కు కాసులు కురిపించే కంచుకోట.. బయటపడ్డ షాకింగ్ నిజం!
Philippines Ferry Accident
/filters:format(webp)/rtv/media/media_files/2026/01/26/dre-2026-01-26-15-28-14.jpg)
Also Read : రెండేళ్ల చిన్నారిని అరెస్ట్ చేసిన అమెరికా అధికారులు
జాంబోంగా నగరం నుంచి సులు ప్రావిన్స్ లోని జోలో ద్వీపానికి ఈ ఫెర్రీ బయలుదేరింది. బాసిలన్ ప్రావెన్స్ లోని బలుక్‌బలుక్ ద్వీపం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే ఇతర నౌకలు మత్స్యకారులు, కోస్ట్ గార్డ్ యూనిట్లు స్పందించి సహాయక చర్యలు ప్రారంభించారు. ప్రమాదానికి గల కారణం ఇంకా తెలియరాలేదని, దీనిపై దర్యాప్తు జరుపుతున్నామని అధికారులు తెలిపారు. మరోవైపు పశ్చిమ జావా ప్రావిన్స్‌లో భారీ వర్షాలతో కొండచరియలు విరిగిపడడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రకృతి విపత్తులో భాగంగా కొండచరియాల విరిగి పడటం మూలంగా 30కి పైగా ఇళ్లు నేలమట్టం అయ్యాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
Follow Us