Boat Accidnet: ఘోర ప్రమాదం.. పడవ బోల్తా పడి 28 మంది మృతి

వియాత్నంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. హలోంగ్‌ బేలోని తుఫాను ప్రభావంతో ఓ బోటు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 28 మంది మృతి చెందారు. రంగంలోకి దిగిన బోర్డర్ గార్డ్స్‌ 12 మంది టూరిస్టులను రక్షించారు. మిగతావారు గల్లంతయ్యారు.

New Update
28 dead, dozens missing as Ha Long Bay tourist boat capsizes in Vietnam

28 dead, dozens missing as Ha Long Bay tourist boat capsizes in Vietnam

వియాత్నంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. హలోంగ్‌ బేలోని ఓ పడవ బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 28 మంది మృతి చెందారు. ఆ బోటులో మొత్తం 53 మంది టూరిస్టులు ప్రయాణిస్తున్నారు. అయితే ప్రయాణం మధ్యలో ఉండగా భారీగా ఈదురు గాలులు, ఉరుములు సంభవించాయి. ఈ క్రమంలోనే బోటు అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో రంగంలోకి దిగిన సహాయక బృందాలు 12 మంది టూరిస్టులను రక్షించారు. మిగతావారు గల్లంతయ్యారు. ఇప్పటిదాకా 27 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.  

Also Read: కిమ్‌ మామా భలే ప్లాన్ వేశాడుగా.. బరువు తగ్గేందుకు సంచలన నిర్ణయం

ఈ ఘటనపై వియాత్నం ప్రధాన మంత్రి ఫామ్ మిన్‌ చిన్ మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ప్రమాదంలో గల్లంతైన వారిని రక్షించేందుకు గాలింపు చర్యలు చేపట్టాలని సహాయక బృందాలను కోరారు. మరోవైపు ఈ ప్రమాదానికి సంబంధించి అధికారులు దర్యాప్తు చేస్తారని అక్కడి ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. 

Advertisment
Advertisment
తాజా కథనాలు