Boat Accident: పడవ బోల్తా.. స్పాట్‌లోనే 40 మంది?

నైజీరియాలోని వాయువ్య సోకోటో రాష్ట్రంలోని స్థానిక గోరోన్యో మార్కెట్‌కు వెళ్తుండగా పడవ ప్రమాదానికి గురైంది. దీంతో 40 మంది నదిలో పడి గల్లంతు అయ్యారు. ఇందులో 10 మందిని ప్రాణాలతో రక్షించినట్లు జాతీయ అత్యవసర నిర్వహణ సంస్థ తెలిపింది.

New Update
Boat Accident

Boat Accident

నైజీరియాలోని(Nigeria) వాయువ్య సోకోటో రాష్ట్రంలోని స్థానిక గోరోన్యో మార్కెట్‌కు వెళ్తుండగా పడవ ప్రమాదానికి గురైంది. దీంతో 40 మంది నదిలో పడి గల్లంతు అయ్యారు. ఇందులో 10 మందిని ప్రాణాలతో రక్షించినట్లు జాతీయ అత్యవసర నిర్వహణ సంస్థ తెలిపింది. అయితే ప్రమాదం జరిగినప్పుడు పడవలో దాదాపుగా 50 మంది ఉన్నట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న తర్వాత భద్రతా బలగాలు గల్లంతు అయిన వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు. రక్షించిన 10 మంది క్షతగాత్రులను స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎంత మంది మృతి చెందారనే విషయాలు తెలియాలి. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 

Also Read:అడ్డంగా దొరికిపోయిన భార్య, ప్రియుడు.. భర్త మర్డర్ కి స్కెచ్చేస్తే షాకింగ్ ట్విస్ట్!

మూడు వారాల కిందటే..

ఇదిలా ఉండగా నైజీరియాలో పడవలు బోల్తా పడటం ఇదేం కొత్త కాదు. ఎప్పటికప్పుడు ఇక్కడ పడవలు బోల్తా పడుతూనే ఉంటాయి. ఇటీవల ఉత్తర-మధ్య నైజీరియాలో నైజర్ రాష్ట్రంలో కూడా సుమారు 100 మంది ప్రయాణికులతో వెళ్తున్న పడవ బోల్తా పడింది. ఈ ప్రమాద ఘటనలో మొత్తం 13 మంది మృతి చెందారని అధికారులు వెల్లడించారు. మిగతా వారు గల్లంతు అయ్యారు. వీరి ఆచూకీ ఇప్పటికీ కూడా తెలియదు. 

ఇది కూడా చూడండి: Crime: అయ్యో .. కూతురి అప్పగింతలు చేస్తూ.. ఆగిపోయిన తల్లి గుండె! పెళ్లి వేడుకలో విషాదం

Advertisment
తాజా కథనాలు