Turkiye Blast: తుర్కియేలో భారీ అగ్ని ప్రమాదం.. 12 మంది మృతి
తుర్కియేలో ఆయుధ తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాద ఘటనలో 12 మంది మృతి చెందగా మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే పేలుడు ఎందువల్ల జరిగిందనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.