Tennessee Blast: అమెరికాలో టెన్నిసీలో భారీ పేలుడు..19మంది మృతి

అమెరికాలోని టెన్నిసీ స్టేట్ లో భారీ పేలుడు సంభవించింది. మిలటరీ యుద్ధ సామాగ్రి ప్లాంట్ లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇందులో 19 మంది మృతి చెందారు. 

New Update
tennissee

అమెరికా కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం టెన్నిసీలోని ఓ ప్లాంట్ లో భారీ పేలుడు సంభవించింది. యుద్ధ సామాగ్రిని స్టోర్ చేసే ప్లాట్ కావడంతో ప్రమాదం పెద్దగా అయింది. ఈ ఘటనలో 19 మంది ఆచూకీ లభించకపోవడంతో వారందరూ ప్రమాదంలో మరణించి ఉంటారని అనుమానిస్తున్నారు. పేలుడు ధాటికి దగ్గరలో ఉన్న కార్లు ఎగిరిపడ్డాయి. మంటలు ఎగిసి పడ్డాయి. కార్లకు సైతం మంటలు వ్యాపించి ప్రమాదం పెద్దది అయింది. అకాశంలో దట్టమైన పొగ వ్యాపించింది. 

భారీ శబ్ధంతో పేలుడు..

ప్లాంట్ లో పేలుడుతో టెన్నీసీ అంతా దద్ధరిల్లింది అని స్థానికులు చెబుతున్నారు. శబ్దం చాలా దూరం వరకు వినిపించిదని తెలుస్తోంది. దగ్గరలో ఉన్న ఇళ్ళు, వాహనాలు అన్నీ కంపించాయి. భూమి సైతం కంపించడంతో భూకంపం వచ్చిందేమోననే అనుమానంతో జనం పరుగులు తీశారు. అయితే తరువాత ప్లాంట్ లో పేలుడు అని తెలియడంతో కాస్త స్థిమిత పడ్డారు. అయితే ఈ ప్రమాదంలో 19 మంది కనిపించకపోవడం...వారు మరణించి ఉంటారనే అనుమానాలు టెన్నిసీలో విషాదాన్ని నింపాయి. పేలుడుకు గల కారణాలు ఇంకా తెలియలేదు. ఎఫ్‌బీఐ ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారని హంఫ్రీస్ కౌంటీ షెరీఫ్ క్రిస్ డేవిస్ తెలిపారు. అక్యూరేట్‌ ఎనర్జిటిక్‌ సిస్టమ్స్‌కు కర్మాగారంలో ఈ పేలుడు జరిగింది. ఈ కర్మాగారంలో పేలుడు పదార్థాల అభివృద్ధి, తయారీ, నిర్వహణ పనులు జరుగుతుంటాయి. 

Advertisment
తాజా కథనాలు