BIG BREAKING : న్యూయార్క్‌లో భారీ పేలుడు..  పేలిన కారు!

అమెరికాలోని న్యూయార్క్ నగరం, బ్రోంక్స్ ప్రాంతంలో బుధవారం రాత్రి జరిగిన ఒక కారు పేలుడు సంఘటనలో ఐదుగురు అగ్నిమాపక సిబ్బంది గాయపడ్డారు. మంటలను అదుపుచేసే ప్రయత్నంలో ఉండగా ఈ పేలుడు సంభవించింది.

New Update
blast

అమెరికాలోని న్యూయార్క్ నగరం, బ్రోంక్స్ ప్రాంతంలో బుధవారం రాత్రి జరిగిన ఒక కారు పేలుడు సంఘటనలో ఐదుగురు అగ్నిమాపక సిబ్బంది గాయపడ్డారు. మొదట కారులో మంటలు చెలరేగాయన్న సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది, మంటలను అదుపుచేసే ప్రయత్నంలో ఉండగా ఈ పేలుడు సంభవించింది. బ్రోంక్స్‌లోని వెస్ట్‌చెస్టర్ అవెన్యూ, ఇంటర్‌వేల్ అవెన్యూ కూడలి వద్ద ఈ ప్రమాదం జరిగింది.

ఒక వాహనంలో మంటలు చెలరేగుతున్నాయని సమాచారం అందిన వెంటనే న్యూయార్క్ సిటీ అగ్నిమాపక విభాగం సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. వారు మంటలను ఆర్పుతున్న సమయంలోనే, ఆ కారు ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలిపోయింది. పేలుడు తీవ్రతకు అగ్నిమాపక సిబ్బంది గాయపడ్డారు. మొత్తం ఐదుగురు సిబ్బందిని చికిత్స నిమిత్తం జాకోబీ హాస్పిటల్ కు  తరలించారు. వారి గాయాల తీవ్రతపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

సోషల్ మీడియాలో వైరల్

ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోలలో భారీ మంటలు  ఎగసిపడుతూ, ఆకాశంలోకి దట్టమైన పొగ వ్యాపించినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. పేలుడు ధాటికి సమీపంలోని భవనాలు కూడా కంపించాయని స్థానిక నివాసితులు తెలిపారు. ఈ కారు పేలుడుకు గల కారణాలపై పోలీసులు, అగ్నిమాపక అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు