J&K Police Station Blast: దర్యాప్తు చేస్తూ సీనియర్ పోలీసు అధికారి, మెజిస్ట్రేట్ తో సహా తొమ్మిది మంది..

నౌగామ్ పోలీస్ స్టేషన్ లో జరిగిన పేలుడులో ఇప్పటికి తొమ్మిది మంది చనిపోయారు. ఇందులో సీనియర్ పోలీసు అధికార, మెజిస్ట్రేట్ తో పాటూ తొమ్మిది మంది ఉన్నారు. మరో 27 మంది తీవ్రంగా గాయపడ్డారు.

New Update
J&K blast

Inspector Asrar (left) was leading the SIA team and Naib Tehsildar (Magistrate) Muzafar Ahmad Khan

ఫరీదాబాద్ వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్ లో పోలీసులు భారీ ఎత్తున పేలుడు పదార్థాలను పట్టుకున్నారు. అరెస్ట్ అయిన డాక్టర్ ముజమ్మిల్ అద్దె ఇంటి నుంచి 360 కిలోగ్రాముల పేలుడు పదార్ధాలను స్వాధీనం చేసుకున్నారు. తరువాత వీటిన జమ్మూ-కాశ్మీర్(Jammu and Kashmir) లోని నౌగామ్ స్టేషన్(police-station) కు తరలించారు. దర్యాప్తులో భాగంగా నిన్న రాత్రి ఆ పేలుడు పదార్ధాల నుంచి నమూనాలను సేకరిస్తుండగా...పెద్ద ప్రమాదం జరిగింది. రెస్క్యూ సిబ్బంది శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం ఇంకా వెతుకుతున్నారు. పేలుడు ఎంత తీవ్రంగా ఉందంటే, సంఘటన స్థలం నుండి 300 అడుగుల దూరం వరకు శరీర భాగాలు కనుగొనబడ్డాయి. పేలుడు సంభవించినప్పుడు మంటలు, దట్టమైన పొగ ఆ ప్రాంతాన్ని కమ్మేశాయి. గాయపడిన వారిలో ఎక్కువ మంది పోలీసులు, ఫోరెన్సిక్ అధికారులు ఉన్నారని తెలుస్తోంది. ఈ పేలుడుతో నౌగామ్ పోలీస్ స్టేషన్ మొత్తం కూలిపోయింది.

Also Read :  ఈ దేశ ద్రోహులకు నేషనల్ మెడికల్ కమిషన్ బిగ్ షాక్!

సీనియర్ పోలీసు అధికారి, మెజిస్ట్రేట్..

నౌగామ్ పేలుడులో మరణించిన వారిలో ఇనెస్పెక్టర్అస్రార్, సోయిబుగ్‌కు చెందిన నయీబ్తహసీల్దార్ (మేజిస్ట్రేట్) ముజాఫర్ అహ్మద్ ఖాన్ కూడా ఉన్నారు. 2019 తర్వాత జమ్మూ-కాశ్మీర్ లో ఉగ్రవాద కేసులు, వైట్ కాలర్ టెర్రరిజాన్ని పరిశోధించడానికి ప్రారంభించిన ఇన్వెస్టిగేటింగ్ టీమ్ లో అస్రార్ కీలక సభ్యుడు అని తెలుస్తోంది. అందుకే ఇప్పుడు ఆయనను ఈ ఢిల్లీ పేలుళ్ల కేసు దర్యాప్తులో కూడా నియమించారని చెబుతున్నారు. వీరిద్దరితోపాటూ పేలుడు పదార్ధాల బ్లాస్ట్ లో మరో ఏడుగురు కూడా మరణించారు. అలాగే మరో 27 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని..మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

Also Read: Bihar Elections 2025: డబ్బున్నోళ్ళదే ప్రజాస్వామ్యం.. బీహార్ ప్రజల ఎన్నికల తీర్పు

Advertisment
తాజా కథనాలు