/rtv/media/media_files/2025/11/12/fotojet-81-2025-11-12-21-29-27.jpg)
Delhi blast incident.. Suspected car found
Delhi Car blast Big update : ఢిల్లీ పేలుడు ఘటన దర్యాప్తులో అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.ఎర్రకోట పార్కింగ్ సమీపంలో పేలిపోయిన ఐ20 కారు నడిపిన నిందితుడి పేరుతో మరో కారు ఉన్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించిన విషయం తెలిసిందే. ఎరుపు రంగు ఫోర్డ్ ఎకోస్పోర్ట్ కారు (DL10CK0458) కోసం పోలీసులు ముమ్మర గాలింపు చేపట్టారు.. చివరకు హరియాణాలోని ఓ గ్రామంలో దాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఉమర్ నబీ పేరుతో మరో కారు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు.. అది ఎక్కడుందో కనిపెట్టేందుకు హరియాణతో పాటు ఇతర ప్రాంతాల్లో ముమ్మర గాలింపు చేపట్టారు. హరియాణా, ఉత్తర్ ప్రదేశ్ పోలీసులను అప్రమత్తం చేశారు. అన్ని పోలీస్ స్టేషన్లు, సరిహద్దు చెక్‌పోస్టులను జల్లెడ పట్టారు. ఈ రెడ్ కలర్ కారును గుర్తించేందుకు ఐదు బృందాలను రంగంలోకి దించి సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. వాహన నంబరు, ఇతర వివరాలను కూడా విస్తృతంగా ప్రచారం చేశారు. చివరకు హరియాణా ఫరీదాబాద్ జిల్లాలోని ఖాండవాలీ గ్రామంలో సదరు కారును గుర్తించిన పోలీసులు దాన్ని స్వాధీనం చేసుకుని ఢిల్లీ తరలించారు.
Follow Us