Explosion in America : అమెరికాలో భారీ పేలుడు..16 మంది సజీవ దహనం

అమెరికాలో భారీ పేలుడు సంబవించింది. అమెరికా టెన్నెస్సీ రాష్ట్రంలోని పేలుడు పదార్థాల తయారీ కేంద్రంలో బ్లాస్ట్ జరిగింది. ఈ ప్రమాద ఘటనలో మొత్తం 16మంది మృతి చెందగా.. పలువురికి తీవ్రంగా గాయాలయ్యాయి.

New Update
AMERICA BIG BLAST

AMERICA BIG BLAST

Explosion in America: అమెరికాలో భారీ పేలుడు సంబవించింది. అమెరికా టెన్నెస్సీ రాష్ట్రంలోని పేలుడు పదార్థాల తయారీ కేంద్రంలో బ్లాస్ట్ జరిగింది. భారీ పేలుడు జరిగినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు.అమెరికా  కాలమానం ప్రకారం ఉదయం 7.48 గంటలకు  హంఫ్రెయ్స్, హిక్మన్ కౌంటీల సరిహద్దులో ఉన్న బక్స్నోర్ట్ ప్రాంతంలోని అక్యురేట్ ఎనర్జెటిక్ సిస్టమ్ ఫ్యాక్టరీలో ఈ పేలుడు ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాద ఘటనలో మొత్తం 16మంది మృతి చెందగా.. పలువురికి తీవ్రంగా గాయాలయ్యాయి. అక్యురేట్ ఎనర్జెటిక్ సిస్టమ్స్ ఫ్యాక్టరీ సైనిక, ఏరోస్పేస్, కమర్షియల్ భవనాలు, కూల్చివేతకు సంబంధించిన సంస్థలకు ఈ పేలుడు పదార్థాలు, టీఎన్‌టీ వంటి ప్రొడక్టులు సరఫరా చేస్తున్నట్లు సమాచారం.

పేలుడు ప్రభావంతో 20కి.మీ దూరం వరకు భూమి కంపించింది. అక్టోబర్ 10న ఈ ప్రమాదం జరగ్గా 16 మంది సజీవదహనం అయ్యారు. అయితే ఆ రోజునుంచి చికిత్స పొందుతున్న వారిలో మరో ఇద్దరు మృతి చెందారు. తాజాగా నాడు పేలుడు సంభవించడంతో 16 మంది మరణించినట్లు తెలుస్తోంది. నేటికి ఇద్దరు కార్మికుల ఆచూకీ లభించలేదు. కాగా కంపెనీలో దాదాపు 150 మంది పనిచేస్తున్నట్లు గుర్తించారు. ప్రమాదంపై FBI దర్యాప్తు ముమ్మరం చేసింది.

Advertisment
తాజా కథనాలు