Venezuela Blasts: వెనెజువెలాలో మళ్లీ ఉద్రిక్తత.. అధ్యక్ష భవనం దగ్గర కాల్పులు

వెనెజువెలాలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. కారకాస్‌లోని అధ్యక్ష భవనం దగ్గర్లో కాల్పుల శబ్దాలు వినిపించడం కలకలం రేపింది. ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్‌ దేశ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన కొన్ని గంటలకే ఈ ఘటన జరిగింది.

New Update
Blasts near Venezuela's presidential palace were warning shots, Official

Blasts near Venezuela's presidential palace were warning shots, Official

వెనెజువెలాలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. కారకాస్‌లోని అధ్యక్ష భవనం దగ్గర్లో  కాల్పుల శబ్దాలు వినిపించడం కలకలం రేపింది. ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్‌ ఇప్పుడు ఆ దేశ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఆమె చేతుల్లోకి అధికారం వెళ్లిన కొన్ని గంటల్లోనే ఈ కాల్పులు జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. కారకాస్‌లోని మిరోఫ్లోర్స్‌ ప్యాలెస్‌పై డ్రోన్లు ఎగరడంతో భద్రతా దళాలు వాటిపై కాల్పులు జరిపాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

Also Read: ఇరాన్‌లో హై టెన్షన్.. భారతీయులకు విదేశాంగ శాఖ కీలక హెచ్చరిక

Blasts Near Venezuela's Presidential Palace

దాదాపు ఒక నిమిషం పాటు కాల్పుల శబ్దాలు వినిపించినట్లు అధ్యక్ష భవనం సమీపంలో ఉంటున్న ఓ నివాసీ తెలిపాడు. తాజాగా జరిగిన కాల్పులపై అమెరికా కూడా స్పందించింది. ఇందులో తమ ప్రమేయం లేదని పేర్కొంది. అక్కడి పరిస్థితులను పరిశీలిస్తున్నామని తెలిపింది. అధ్యక్ష భవనం వద్ద భద్రత నిర్వహించే పారమిలిటరీ సభ్యుల మధ్య సమన్వయ లోపం వల్లే కాల్పులు జరిగినట్లు మరికొందరు అంటున్నారు.  

Also Read:  బంగ్లాదేశ్‌లో హిందూ మహిళపై గ్యాంగ్ రేప్.. చెట్టుకు కట్టేసి జుట్టు కట్ చేసి

Advertisment
తాజా కథనాలు