PM Modi: ప్రధాని మోదీ కీలక నిర్ణయం.. పారదర్శక కమ్యూనికేషన్‌కు పిలుపు
ప్రధాని మోదీ తమ పార్టీ మంత్రులు, ఉన్నతాధికారులకు కీలక సూచనలు చేశారు. ప్రభుత్వ నిర్ణయాలు, విధానాలు, సాధించిన విజయాలను ప్రజలకు తెలియజేయడంలో యాక్టీవ్‌గా ఉండాలని చెప్పారు.
ప్రధాని మోదీ తమ పార్టీ మంత్రులు, ఉన్నతాధికారులకు కీలక సూచనలు చేశారు. ప్రభుత్వ నిర్ణయాలు, విధానాలు, సాధించిన విజయాలను ప్రజలకు తెలియజేయడంలో యాక్టీవ్‌గా ఉండాలని చెప్పారు.
పశ్చిమ బెంగాల్లో ప్రముఖ న్యూస్ ఛానల్స్ ఏబీపీ అనంద, రిపబ్లిక్ టీవీ, టీవీ9 ను బహిష్కరిస్తున్నట్లు టీఎంసీ పార్టీ ప్రకటించింది. బెంగాల్ వ్యతిరేక ఎజెండాతో ప్రచారాలు చేస్తున్నాయనే కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.
పార్టీలకతీతంగా హైడ్రా అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తోంది. తాజాగా మైలార్‌దేవ్‌పల్లి బీజేపీ కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు నేలమట్టం చేశారు. నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేశారని ఆయన ఆందోళనకు దిగారు.
ఇటీవల మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ భారీ విగ్రహం కూలిన ఘటనపై తాజాగా ప్రధాని మోదీ స్పందించారు. ఈ ఘటన వల్ల బాధకు గురైన వారందరికీ తలవంచి నా క్షమాపణలు చెబుతున్నానని పేర్కొన్నారు. మనకు ఈ దైవం కంటే గొప్పది ఏదీ లేదని వ్యాఖ్యానించారు.
ఏపీ పాలిటిక్స్ లో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకోనుంది. పుష్ప నేడు బీజేపీలో చేరనున్నారు. ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి సమక్షంలో కాషాయ కండువా కప్పుకోనున్నారు. పుష్ప ఏంటి? బీజేపీలో చేరడం ఏంటి? అని అనుకుంటున్నారా? అయితే.. RTV అందిస్తున్న ఈ Exclusive స్టోరీ చదివేయండి.
మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న జాతీయ రెజ్లింగ్ ఫెడరేషన్ మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ సింగ్ తాజాగా ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని పిటిషన్ వేశారు. మహిళా రెజ్లర్లు తనపై చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని అన్నారు.
రాజ్యసభ ఉపఎన్నికల్లో 12 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. ఈనెల 21వరకు దీని కోసం నామినేషన్లు స్వీకరించారు.ఇందులో తొమ్మిది స్థానాల్లో బీజేపీ,రెండు స్థానాల్లో ఎన్సీపీ, ఆర్ఎల్ఎం అభ్యర్ధులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.అలాగే తెలంగాణ నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ సింఘ్వీ ఎన్నికయ్యారు.
బీజేపీలో బీఆర్ఎస్ విలీనం హామీతోనే కవితకు బెయిల్ వచ్చిందని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి అన్నారు. విలీనం చేయకపోతే వచ్చే ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తాయన్నారు. మోదీకి కేసీఆర్ ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఇదే అని, కవిత లిక్కర్ మాఫియా క్వీన్ అంటూ విమర్శలు గుప్పించారు.
మహేశ్వరంలోని తుమ్మల చెరువును కబ్జా చేశారని బీజేపీ నేత అందెల శ్రీరాములు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రి సబితా అండతో కొందరు విచ్చలవిడిగా కబ్జాలు చేశారన్నారు. 8 ఎకరాల తుమ్మల చెరువును రాత్రికి రాత్రే మాయం చేశారని ఆరోపించారు.