CM Revanth reddy: సీఎం రేవంత్‌పై పరువు నష్టం కేసు.. విచారణ వాయిదా

TG: సీఎం రేవంత్ రెడ్డిపై నమోదైన పరువు నష్టం కేసు విచారణ మరోసారి వాయిదా పడింది. పార్లమెంట్ ఎన్నికల సమయంలో బీజేపీపై తప్పుడు ప్రచారాలు చేశారని ఆ పార్టీ నేత కాసం వెంకటేశ్వర్లు రేవంత్‌పై వేసిన పిటిషన్ ను వచ్చే నెల 11న విచారిస్తామని నాంపల్లి కోర్టు తెలిపింది.

New Update
revanth3

CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిపై నమోదు అయిన పరువు నష్టం కేసు విచారణ మరోసారి వాయిదా పడింది. సీఎం రేవంత్ పై బీజేపీ నేత కాసం వెంకటేశ్వర్లు వేసిన పరువు నష్టం కేసు విచారణను డిసెంబర్ 11కు వాయిదా వేసింది. కాగా ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి పలు బహిరంగ సభల్లో మాట్లాడుతూ.. కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తే  ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను రద్దు చేస్తుందని  సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆరోజు సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో సైతం చర్చనీయాంశంగా మారాయి. 

ఇది కూడా చదవండి: ఈ నెల 30న అకౌంట్లోకి డబ్బు జమ!

తప్పుడు ప్రచారాలు అంటూ..

ఇది కూడా చదవండి: రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం!

సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలంటూ బీజేపీ నేత కళాసం కాసం వెంకటేశ్వర్లు కోర్టులో పరువు నష్టం దావా వేశారు.  పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తగూడెంలో జరిగిన బహిరంగ సభలో రేవంత్‌రెడ్డి తప్పుడు ప్రచారం చేశారని తన పిటిషన్‌లో పేర్కొన్నారు. తప్పుడు ప్రచారాలు చేసి ప్రజలను తప్పు దోవ పట్టించే విధంగా చేసిన వ్యాఖ్యలకు గాను రేవంత్ పై క్రిమినల్  చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై ఇప్పటికే విచారణ నిర్వహించిన నాంపల్లి కోర్టు.. పిటిషనర్‌ వెంకటేశ్వర్లు వాంగ్మూలం నమోదు చేసింది. పిటిషనర్‌ను క్రాస్‌ ఎగ్జామినేషన్‌ చేయడానికి సీఎం రేవంత్‌ రెడ్డి తరఫు న్యాయవాది సమయం కోరడంతో విచారణను వచ్చే నెల 11కు వాయిదా వేసింది. అయితే తదుపరి విచారణలో కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందనే ఉత్కంఠ కొనసాగుతోంది.

ఇది కూడా చదవండి: BREAKING: వైసీపీ మాజీ మంత్రి పీఏ అరెస్ట్!

ఇది కూడా చదవండి: మహిళలకు అదిరిపోయే గు డ్ న్యూస్.. ఈరోజు భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు. . ఏంటంటే?
Advertisment
Advertisment
తాజా కథనాలు