మాజీ మంత్రి కేటీఆర్ సంచలన ట్వీట్

TG: సీఎం రేవంత్ రెడ్డికి అండగా టీబీజేపీ నేతలు ఉంటారని అన్నారు కేటీఆర్. వంత్ మీద ఈగ వాలకుండా కాపాడుకుంటారని సెటైర్లు వేశారు. బీజేపీ, కాంగ్రెస్ కలిసి పనిచేస్తున్నాయని విమర్శలు గుప్పించారు.

New Update
KTR Arrest Revanth

MLA KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ట్వీట్న చేశారు. తెలంగాణ బీజేపీ నాయకులపై తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ - బీజేపీ కలిసి పనిచేస్తోందంటూ విమర్శలు చేశారు. రేవంత్‌ రెడ్డి కోసం టీబీజేపీ నేతలు పని చేస్తున్నారని అన్నారు. చోటేభాయ్ కు వ్యూహకర్తగా, కాంగ్రెస్ కట్టర్ కార్యకర్తలుగా విశ్రమించకుండా పని చేస్తున్నారు విమర్శలు గుప్పించారు. ఎన్ని అరాచకాలు జరిగినా ఒక్కరూ నోరుమెదపరని అన్నారు.

Also Read: ఐటీలో చేరాలనుకునేవారికి గుడ్‌న్యూస్‌.. వచ్చే ఆరు నెలలూ పండగే

Also Read: యువతిని 40 ముక్కలుగా నరికి చంపిన ప్రియుడు.. కారణం ఏంటో తెలుసా?

రేవంత్ ను కాపాడుకుంటారు..!

రేవంత్ మీద ఈగ వాలకుండాతెలంగాణ బీజేపీ నేతలు కాపాడుకుంటారని కేటీఆర్ చురకలు అంటించారు. హైడ్రా మంచిదంటారు, మూసి కావాలంటారు, ఏమన్నా అంటే నిద్ర నటిస్తారు ఈ బీజేపీ నేతలు అని సెటైర్లు చేశారు. పిల్లలు చనిపోయినా, రైతు గుండె పగిలినా, గిరిజనులను చెరపట్టినా, చప్పట్లు కొడతారని.. తెలంగాణలో వారి చేతిలోనే కమలం ఉందని అన్నారు. ప్రస్తుతం కేటీఆర్ చేసిన ట్వీట్ తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

Also read: మతం మారి ఆ రిజర్వేషన్లు పొందడం రాజ్యంగాన్ని మోసం చేయడమే: సుప్రీంకోర్టు

Also Read: కొత్త పాన్ కార్డ్ 2.0 ప్రాజెక్ట్ ఏంటి? దీని వలన లాభాలేంటి?

Advertisment
తాజా కథనాలు