బీజేపీ సంచలనం.. పార్లమెంట్‌లో 16 బిల్లులు! రేపటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. డిసెంబరు 20 వరకూ కొనసాగనున్నాయి. ఈ సమావేశాల్లో మొత్తం 16 కీలక బిల్లులను కేంద్రం సభలో ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. అందులో వక్ఫ్ సవరణ బిల్లు దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. By V.J Reddy 24 Nov 2024 in నేషనల్ Politics New Update షేర్ చేయండి Parliament Sessions: రేపటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. రేపటి నుంచి సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈరోజు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు పార్లమెంట్ ఉభయ సభల్లోని రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్‌లతో భేటీ అయ్యారు. డిఫెన్స్ మినిస్టర్ రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షత ఈ సమావేశం జరిగింది. కాగా ఈ పార్లమెంట్ సమావేశాలు ఈ నెల 25 నుంచి మొదలై డిసెంబరు 20 వరకూ కొనసాగనున్నాయి. అయితే ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులను కేంద్రం ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. Also Read: Big Boss 8: బిగ్ షాక్! నబీల్ ఎలిమినేటెడ్.. యష్మీ, పృథ్వీ డేంజర్ జోన్ మొత్తం 16 బిల్లులు..! 1.భారతీయ వాయుయన్ విధేయక్, 2024 బిల్లు2. విపత్తు నిర్వహణ (సవరణ) బిల్లు, 20243. గోవా రాష్ట్రం అసెంబ్లీ నియోజకవర్గాలలో షెడ్యూల్డ్ తెగల ప్రాతినిధ్య పునర్నిర్మాణం బిల్లు, 20244. ది బిల్స్ ఆఫ్ లాడింగ్ బిల్లు, 20245. ది క్యారేజ్ ఆఫ్ గూడ్స్ బై సీ బిల్లు, 20246. రైల్వేస్ (సవరణ) బిల్లు, 20247. బ్యాంకింగ్ చట్టాల (సవరణ) బిల్లు, 20248. ముసల్మాన్ వక్ఫ్ (రద్దు) బిల్లు, 20249. వక్ఫ్ (సవరణ) బిల్లు, 202410. చమురు క్షేత్రాల (నియంత్రణ మరియు అభివృద్ధి) సవరణ బిల్లు, 202411. బాయిలర్స్ బిల్లు, 202412. రాష్ట్రీయ సహకారి విశ్వవిద్యాలయ బిల్లు, 202413. పంజాబ్ కోర్టుల (సవరణ) బిల్లు, 202414. మర్చంట్ షిప్పింగ్ బిల్లు, 202415. కోస్టల్ షిప్పింగ్ బిల్లు, 202416. ఇండియన్ పోర్ట్స్ బిల్లు, 2024. Also Read: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్ట్? అయితే ఈ సమావేశాల్లోనే వన్ నేషన్ వన్ ఎలెక్షన్ బిల్లును కూడా కేంద్రం ప్రవేశపెట్టే ఆలోచలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో గత ఎన్నికల దానికంటే తక్కువ మెజారిటీతో బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. కాగా ఎన్నికల తరువాత కేంద్రం భారత దేశ 2024-25 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ను ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. Also Read: షారుఖ్, సల్మాన్ కాదు.. భారతదేశంలోనే అత్యధిక రెమ్యునరేషన్ ఈ తెలుగు హీరోదే..? ఒక్క సినిమాకు 300 కోట్లు Also Read: ఆ దేశంలో అధికారుల కంటే ఖైదీల సంపాదనే ఎక్కువ #Parliament Winter Session #NDA Govt #16 Bills #bjp మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి