బీజేపీకే సగం మంత్రిత్వ శాఖలు.. షిండేకు ఆ పదవి ఖరారు ! మహారాష్ట్ర సీఎం ఎంపికపై మహాయుతి నేతలు ఢిల్లీలో బీజేపీ అధిష్ఠానంతో సాయంత్రం భేటీ కానున్నారు. బీజేపీకి 20, శివసేనకు(షిండే)13, ఎన్సీపీ (అజిత్ పవార్) 9 మంత్రి పదవులు వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 28 Nov 2024 in నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి మహారాష్ట్ర ఎన్నికల్లో భారీ విజయం సాధించిన మహాయుతి కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. సీఎం ఎంపిక, ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించేందుకు మహాయుతి నేతలు ఏక్‌నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ గురువారం ఢిల్లీలో బీజేపీ అధిష్ఠానంతో సాయంత్రం 6 గంటలకు భేటీ కానున్నారు. కేంద్ర హోం మంత్రి అమత్ షాతో సమావేశం ముగిసిన తర్వాత తదుపరి ముఖ్యమంత్రి ఎవరు అనే ప్రకటన వెలువడనున్నట్లు సమాచారం. ఇప్పటికే మహారాష్ట్ర కొత్త సీఎంగా బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ బాధ్యతలు చేపట్టనున్నట్లు స్పష్టమవుతోంది. నవంబర్ 30న లేదా డిసెంబర్ 1న మహారాష్ట్రలో కొత్త సర్కార్ కోలవుతీరే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. Also read: ఐటీలో చేరాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. వచ్చే ఆరు నెలలూ పండగే బీజేపీకి 20 సీట్లు అయితే ఈసారి ఇద్దరు డిప్యూటీ సీఎంలను నియమించనున్నట్లు తెలుస్తోంది. కేబినెట్‌లో సగం మంత్రి పదవులు బీజేపీ దక్కనున్నట్లు సమాచారం. ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనకు మూడు కీలక మంత్రిత్వ శాఖలో పాటు 12 పదవులు వచ్చే ఛాన్స్ ఉన్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. షిండేకు డిప్యూటీ సీఎం ఆఫర్ ఇచ్చారని, అలాగే కీలక మంత్రిత్వ శాఖలు ఇచ్చేందుకు బీజేపీ హైకమాండ్ మొగ్గు చూపుతోందని తెలుస్తోంది. మరోవైపు ఆయనకు కేంద్ర కేబినెట్ బెర్త్ కూడా ఆఫర్ చేసినట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. షిండే అర్బన్, డెవలప్‌మెంట్ శాఖ అడుగుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయనకు ఈ పదవి వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. Also Read: పెరుగుతోన్న వాయు కాలుష్యం.. ఏటా 15 లక్షల మంది మృతి మొత్తానికి మహారాష్ట్ర కేబినెట్‌లో గరిష్ఠంగా 43 మంది మంత్రులను నియమించే ఛాన్స్ ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. ఇందులో 20కి పైగా మంత్రిత్వ శాఖలు బీజేపీకే వెళ్లనున్నాయని.. ఇప్పటికే కూటమి నేతల మధ్య అంగీకారం కూడా జరిగినట్లు తెలుస్తోంది. శివసేన (షిండే)కు 13, ఎన్సీపీ (అజిత్ పవార్)కు 9 శాఖలు ఇవ్వాలని హైకమాండ్ నిర్ణయించినట్లు సమాచారం. షిండే వర్గానికి అర్బన్ డెవలప్‌మెంట్‌తో పాటు ప్రజా పనులు అభివృద్ధి, జల వనరుల శాఖను ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. Also Read: పది నిమిషాలకో మహిళ లేదా బాలికను చంపేస్తున్నారు–యూఎన్ విమెన్ నివేదిక #eknath-shinde #national-news #bjp #telugu-news #devendra fadnavis #maharashtra మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి