Adani: హమ్మయ్య ధారావి ప్రాజెక్టు సేఫ్...ఆదానీకి కాస్త ఊరట అమెరికా కేసులతో సతమతమవుతున్న అదానీకి మహారాష్ట్రలో మహాయుతి గెలుపు కాస్త ఊరటను ఇచ్చింది. 3 బిలియన్ డాలర్ల ధారావి ప్రాజెక్టుకు ముప్పు తప్పింది. తాము అధికారంలోకి వస్తే ధారావా ప్రాజెక్టను రద్దు చేస్తామని శివసేన చెప్పింది. By Manogna alamuru 23 Nov 2024 in నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి ఎక్కడ బీజేపీ వచ్చినా అదానీ పంట పడినట్టే. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే. దేశంలో అదానీ కంపెనీ చేపట్టిన ఏ ప్రాజెక్టులు అయిన కంటిన్యూ కావాలంటే బీజేపీ అధికారంలో ఉండాల్సిందే. అదే కాంగ్రెస్ అయితే అన్ని ప్రాజెక్టులు గోవిందా. కాంగ్రెస్ ఈ విషయాన్ని చాలా సార్లే ప్రకటించింది. అలాగే మహారాష్ట్రలో అదానీ కంపెనీ చేట్టిన ధారావి ప్రాజెక్టును కూడా రద్దు చేస్తామని ఉద్ధవ్ నేతృత్వంలోని శివసేన ప్రకటించింది. అసలే ప్రస్తుతం అమెరికా కోర్టు, కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు అదానీ. ఇప్పుడు కనుక మహారాష్ట్రలో శివసేన గెలిచి ఉంటే మూలిగే నక్కపై తిటా పండు పడ్డట్టు అయ్యేది. అయితే అదానీ ఈ ప్రమాదాన్ని తప్పించుకున్నారు. మహారాష్ట్ర ఓటర్లు మళ్ళీ మహాయుతికే పట్టం కట్టడంతో ఆయన ఊపిరి పీల్చుకున్నారు. Also Read: MH: మనిషే కామ్..పని మాత్రం స్ట్రాంగ్...మహారాష్ట్ర నెక్స్ట్ సీఎం శిండే? అతి పెద్ద ప్రాజెక్టు.. ముంబయిలో అతి పెద్ద మురికివాడ ఏదంటే టక్కున చెప్పే సమాధానం ధారావి. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే ప్రాజెక్ట్‌ను అదానీ 2022లో దక్కించుకున్నారు. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా ఒక్కో కుటుంబానికి 350 చదరపు అడుగుల ఫ్లాట్స్‌ను ఉచితంగా కట్టించి ఇవ్వనున్నారు. మురికివాడలోని ప్రజలకు ఇళ్ల నిర్మాణంలో భాగంగా మహారాష్ట్ర ప్రభుత్వం 256 ఎకరాల భూమిని అదానీకి అప్పగించింది. అయితే ఈ ప్రాజెక్టు మీద మొదట నుంచీ విపక్షాలు మండిపడుతున్నాయి. ప్రాజెక్టులో ఉన్నది మంచి విషయమే అయినా..దానిని పర్టిక్యులర్ గా అదానీకి అప్పగించడంపై విపక్షాలు దండెత్తాయి. సుమారు 10 లక్షల మంది నివసించే ఈ మురికివాడ అభివృద్ధి ప్రాజెక్ట్..తన స్నేహితుడు గౌతమ్ అదానీని మరింత ధనవంతుడిని చేసేందుకు మోదీ కట్టబెట్టారని రాహుల్ గాంధీ ఆరోపించారు. శివసేన కూడా దీనిపై మండిపడింది. ఎన్నికల ప్రచారంలో విమర్శలు మీద విమర్శలు గుప్పించింది. తాము అధికారంలోకి వస్తే రద్దు చేస్తామని ప్రకటించింది. ఇప్పటికే ముంబయిలో అదానీ కంపెనీ..ఎయిర్‌పోర్ట్‌ను, విద్యుత్ పంపిణీ వ్యాపారాలు చేసతోంది. దానికి తోడు ధారావి ప్రాజెక్టు కూడా అదానీకే కట్టెట్టారు. అందుకే విపక్షాలు అంతగా దీనిపై విమర్శలు చేస్తున్నాయి. ధారావి చాలా పెద్ద ప్రాజెక్టు. బాగా డబ్బలు తీసుకువస్తుంది కూడా. ఒకవేళ ఉద్ధవ్, కాంగ్రెస్, ఎన్‌సీపీఈతో కూడిన మహా వికాస్ అఘాఢీ ప్రభుత్వం వచ్చి ఉంటే ఈ ప్రాజెక్ట్ నిలిచిపోయేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. Also Read: Waynad: చాలా గర్వంగా ఉంది–రాహుల్ గాంధీ ఇది కూడా చూడండి: కొడంగల్‌లో ఫార్మా కంపెనీ రద్దు.. సీఎం రేవంత్ సంచలనం! ఇది కూడా చూడండి: మహారాష్ట్రలో 'నితీష్ కుమార్' మోడల్.. సీఎం అభ్యర్థిపై బీజేపీ వ్యూహం ఇదేనా? #bjp #adani #maharashtra election #big-relief మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి