కాంగ్రెస్‌కు భవిష్యత్తు లేదు.. ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా బీజేపీలో చేరాలి: బీజేపీ నేత మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోవడంతో బీజేపీ నేత ఆశిష్ దేశ్‌ముఖ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌కు భవిష్యత్తు లేదని.. ఆ పార్టీ నుంచి గెలిచిన 16 మంది ఎమ్మెల్యేలంతా బీజేపీలో చేరాలంటూ పిలుపునిచ్చారు. By B Aravind 27 Nov 2024 in నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన మహాయతి కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా మహారాష్ట్రకు చెందిన బీజేపీ నేత ఆశిష్ దేశ్‌ముఖ్(Ashish Deshmukh) సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌కు భవిష్యత్తు లేదని.. ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా బీజేపీలో చేరాలంటూ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ '' మహారాష్ట్రలో మహాయుతి కూటమి భారీ మెజార్టీతో గెలిచింది. కాంగ్రెస్ ఘోర ఓటమిని మనమందరం చూశాం. చాలా ప్రాంతాల్లో కూడా కాంగ్రెస్ ఓడిపోవడాన్ని చూస్తున్నాం. Also read: సీఎంగా ఫడ్నవీస్.. షిండేకు కేంద్రమంత్రి పదవి ! గతంతో పోల్చుకుంటే కాంగ్రెస్‌కు ఇప్పుడు మరిన్ని ఓట్లు తగ్గాయి. ఆ పార్టీకి భవిష్యత్తు లేదు. ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు ఇంకా అందులోనే ఉంటే మీ భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకంగా మారుతుంది. అందుకే కాంగ్రెస్ నుంచి గెలిచిన 16 మంది ఎమ్మెల్యేలందరూ కూడా బీజేపీలో చేరాలని'' ఆశిష్ పిలుపునిచ్చారు. ఇదిలాఉండగా.. ఆశిష్ దేశ్‌ముఖ్ మాజీ కాంగ్రెస్ నేత. గతేడాది పలు కారణాల వల్ల పార్టీ ఆయన్ని సస్పెండ్ చేసింది. ఆ తర్వాత ఆశిష్ బీజేపీలోకి చేరారు. నాగ్‌పుర్‌లోని సావ్నర్ నుంచి పోటీ చేసి గెలిచారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయన కాంగ్రెస్‌పై తీవ్రంగా విమర్శలు చేశారు. ఇదిలాఉండా ఈ ఎన్నికల్లో మహాయుతి కూటమి 231 స్థానాల్లో గెలిచింది. ఇందులో బీజేపీ 132 సీట్లు సాధించగా.. శివసేన (షిండే) 57, ఎన్సీపీ (అజిత్ పవార్) 41 సీట్లు సాధించాయి. ఇక మహా వికాస్ అఘాడి కేవలం 46 స్థానాలకే పరిమితమై ఘోరంగా ఓటమి పాలయ్యింది. Also Read: అదానీని జైల్లో వేయాల్సిందే: రాహుల్ గాంధీ ఇదిలాఉండగా బీజేపీ, ఎన్సీపీ (అజిత్ పవార్), శివసేన(షిండే) పార్టీల నేతలతో బీజేపీ హైకమాండ్ గురువారం ముఖ్యమైన సమావేశాన్ని నిర్వహించనుంది. అయితే ఈ భేటీలో మహారాష్ట్ర రాజకీయాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోవచ్చని తెలుస్తోంది. అలాగే సీఎం అభ్యర్థిని కూడా అధికారికంగా ప్రకటించే ఛాన్స్ ఉందని సమాచారం. Also Read: ఏపీకి మోదీ సర్కార్ శుభవార్త.. తొలి విడత నిధులు విడుదల Also Read: రేవంత్ పాలన ఎలా ఉంది?: మోదీ ప్రశ్నలకు బీజేపీ నేతలు షాక్! #maharashtra #congress #national-news #bjp #Ashish Deshmukh మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి